BigTV English
Advertisement

Mega Couple: నార్తన్ లైట్స్ అందాల మధ్య.. మెగా జంట హనీమూన్..

Mega Couple: నార్తన్ లైట్స్ అందాల మధ్య.. మెగా జంట హనీమూన్..

Mega Couple: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఏ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అయిందో అందరికీ తెలుసు. ఇటలీలో మొదలైన తమ ప్రేమకు గుర్తుగా.. పెళ్లిని కూడా అక్కడే జరుపుకున్నారు ఈ జంట. ఇక పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. ఆ తర్వాత హైదరాబాదులో రిసెప్షన్ కూడా ఇచ్చారు. అది పూర్తయ్యాక డెహ్రాడూన్ లో లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులతో కలిసి మరొక రిసెప్షన్ కూడా గ్రాండ్ గా జరిగింది.


ఇంతవరకు అంతా బాగుంది కానీ ఆ తర్వాత ఈ జంట సోషల్ మీడియాలో చాలా సైలెంట్ అయిపోయింది విషయం ఏమిటో తెలియదు కానీ ఆ తర్వాత వీళ్ళ నుంచి కొత్తగా ఎటువంటి అప్డేట్స్ రాలేదు. అయితే రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ లో వరుణ్ తేజ్ షేర్ చేసిన కొన్ని పిక్స్ ఇప్పుడు తిరిగి వైరల్ అవుతున్నాయి. మాయా లోకంలో మెగా జంట హనీమూన్ అంటూ నటిజెన్లు వీటికి కామెంట్స్ పెడుతున్నారు.

నవంబర్ 1న ఇటలీలోని టాస్క్కోలో పెళ్లి చేసుకున్న ఈ జంట.. వరుణ్ తేజ్ బిజీ షెడ్యూల్ కారణంగా హనీమూన్ కి కాస్త బ్రేక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఇద్దరు కలిసి తమ డ్రీమ్ హనీమూన్ కోసం వెళ్ళినట్లు తెలుస్తోంది. బిజీ రొటీన్ లైఫ్ నుంచి కాస్త విరామం తీసుకుని హడావిడి కి దూరంగా నూతన వధూవరులు తమను తాము మర్చిపోయి విహారిస్తున్నారు. తాజాగా వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో నార్తర్న్ లైట్స్ అందాన్ని షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.


ఈ అందమైన ఫోటోలతో పాటు మరో అద్భుతమైన క్యాప్షన్ ని కూడా జత చేశాడు మెగా ప్రిన్స్.’ నా చేతులతో కనిపిస్తున్న స్టార్ డస్ట్ ని పట్టుకోవడం నిజంగా ఒక అద్వితీయమైన అనుభూతి.. ఇది ఒక మ్యాజికల్ ఎక్స్పీరియన్స్.. ‘అని వరుణ్ పెట్టిన క్యాప్షన్ ఫోటోకి బాగా సెట్ అయింది. చుట్టూ మంచుతో కప్పబడిన చెట్ల మధ్య, మంచి కొండల మధ్య నడుస్తున్న వరుణ్ ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక వరుణ్ తేజ్ కెరీర్ విషయానికి వస్తే.. రీసెంట్ గా అతను నటించిన హై యాక్షన్ థ్రిల్లర్ గాండీవధారి అర్జున యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. నెక్స్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ ఫిబ్రవరి 16, 2024న విడుదల కాబోతోంది. ఈ మూవీ సక్సెస్ సాధించాలి అని మెగా ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×