BigTV English

Christmas Tree : కాంతులీనే క్రిస్మస్ ట్రీ

Christmas Tree : కాంతులీనే క్రిస్మస్ ట్రీ

Christmas Tree : ఎటు చూసినా క్రిస్మస్ సందడి. ఈ పండుగలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది క్రిస్మస్ చెట్టు. ఎత్తు, అలంకరణలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన ట్రీలు ఇవే. న్యూయార్క్ సిటీలోని రాక్ ఫెల్లర్ సెంటర్‌లో ఏర్పాటు చేసే ట్రీ అతి పెద్దది. 75 నుంచి 100 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. 1933 నుంచి ఇక్కడ ట్రీని ఏర్పాటు చేస్తున్నారు.


దీని అలంకరణకు వేల సంఖ్యలో విద్యుద్దీపాలను వినియోగిస్తారు. క్రిస్మస్ ట్రీ అగ్రభాగాన మిలమిలా మెరిసే స్వరోవ్‌స్కీ క్రిస్టల్ స్టార్‌ను ఏర్పాటు చేయడం స్పెషల్. లండన్ నడిబొడ్డున కొవెంట్ గార్డెన్లోని క్రిస్మస్ ట్రీ‌ విద్యుద్దీపాలతో కాంతులీనుతుంది. ఈ షాపింగ్ హబ్‌కు వచ్చే లక్షలాది మందిని కట్టిపడేస్తుంది.

అలంకరణ విషయంలో పారిస్‌లోని అతి పెద్ద రిటైల్ స్టోర్స్ గాలరీ లఫాయెత్‌లోని క్రిస్మస్ ట్రీ టాప్. దానికి మరేదీ సాటిరాదు. రియోడీ జనీరో కోపకబనా బీచ్‌లోని క్రిస్మస్ ట్రీని చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ప్రపంచంలో అతి పెద్ద ఫ్లోటింగ్ క్రిస్మస్ ట్రీ ఇదే.


మాస్కో రెడ్‌స్క్వేర్‌లోని క్రిస్మస్ ట్రీకి ఎంతో చారిత్రక, పండుగ ప్రాధాన్యం ఉంది. క్రెమ్లిన్ భవనం నేపథ్యంలో కనువిందు చేసే ఈ ట్రీ సంబురాలకు నెలవు. కేథడ్రల్ స్క్వేర్(లిథువేనియా), డార్ట్‌మండ్(జర్మనీ), పుర్టొ డెల్ సాల్ స్క్వేర్(మాడ్రిడ్)లో క్రిస్మస్ ట్రీలు కూడా ఎంతో అందంగా ముస్తాబయ్యాయి.

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×