Mega Family – Allu Family : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న స్థాయి గురించి స్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే వెళ్తుంది. గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని మెగాస్టార్ చిరంజీవి శాసిస్తున్నారు అంటే అది మామూలు విషయం కాదు. కేవలం సినిమాలలో హిట్స్ కొట్టడం వలన మాత్రమే ఆ స్థాయి రాదు. వ్యక్తిగతంగా కూడా సమాజానికి ఎంతో సేవ చేసి మన అనుకున్న వాళ్లకోసం నిలబడితేనే సరైన గౌరవం లభిస్తుంది. నేడు మెగాస్టార్ చిరంజీవికి ఆ గౌరవం ఉంది. చాలా సందర్భాలలో మెగాస్టార్ చిరంజీవి వలన సాయం పొందుకున్న వాళ్ళు కృతజ్ఞతలు తెలిపిన రోజులు కూడా ఉన్నాయి. అయితే మంచి ఎప్పుడు మైక్ లో చెప్పాలి చెడు ఎప్పుడు చెవిలో చెప్పాలి అనే సిద్ధాంతం మెగాస్టార్ చిరంజీవిది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు పదిమందికి పైగా వరకు హీరోలు ఉన్నారు.
గంగోత్రి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఇంటర్వ్యూ ఇచ్చాడు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ చాలా సందర్భాలలో మెగాస్టార్ చిరంజీవి మీద ఉన్న ప్రేమను ఆన్ స్టేజ్ పై తెలిపాడు. ఇక తనకు మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే ఇన్స్పిరేషన్ అని చెబుతూ వచ్చాడు. అలానే తనకు మెగాస్టార్ చిరంజీవి తర్వాతే ఎవరైనా అని అరిచి గీపెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో అల్లు అర్జున్ తనకంటూ ఒక సొంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు అనే మాట వాస్తవం. ఒకప్పుడు మెగా ఫ్యాన్స్ అని ప్రస్తావించే అల్లు అర్జున్ రీసెంట్ టైమ్స్ లో వచ్చే స్పీచెస్ లో నా ఆర్మీ నా ఫ్యాన్స్ అని అనడం మొదలుపెట్టాడు. అల్లు అర్జున్ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కోరుకోవడం తప్పుకాదు. కానీ ఇప్పటివరకు వచ్చిన కెరియర్ లో ఎవరు మన వెనుక ఉండి నడిపించారు అనేది మాత్రం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం.
ఇకపోతే అల్లు ఫ్యామిలి కి మెగా ఫ్యామిలీకి మధ్య వివాదాలు ఉన్నాయి అని గత కొన్ని రోజుల నుంచి పలు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏ వార్తకి కూడా మెగా ఫ్యామిలీ నుంచి కానీ అల్లు ఫ్యామిలి నుంచి కానీ సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ మెగా ఫ్యామిలీ అంతా ఒకటే అని ఈరోజు జరిగిన ఒక సంఘటన నిరూపించింది. అల్లు అర్జున్ ని అరెస్టు చేయగానే మెగా ఫ్యామిలీ అంతా కూడా ఒక్కసారిగా అల్లు అర్జున్ కోసం ఇంటికి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ వీళ్లంతా కూడా తమ పనులను పక్కనపెట్టి హడావిడిగా అల్లు అర్జున్ కోసం, అల్లు అర్జున్ బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. ఏదేమైనా కొన్ని ఆడియో వేడుకల్లో వీరు కనిపించక పోయినా సరే, ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సిన మాట మెగా ఫ్యామిలీ అన్నిటికి రాకపోవచ్చు. కానీ ఖచ్చితంగా కన్నీటికి మాత్రం వస్తారు అని చెప్పాల్సిందే.
Also Read : Allu Arjun Arrest: బన్నీ అరెస్ట్ అయ్యినప్పుడు వేసుకున్న టీ షర్ట్.. ఇది గమనించారా.. ?