టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ గా గుర్తింపు తెచ్చుకుంది మంచు ఫ్యామిలీ (Manchu Family). క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఈ కుటుంబం నుంచి గొడవలు.. అందులోనూ రోడ్డుకెక్కడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. అటు అభిమానులే కాదు సినీ సెలబ్రిటీలు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సైతం ఈ విషయం తెలిసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంచు కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఎప్పటినుంచో గొడవలు ఉన్నా.. ఆ గొడవలు కాస్త ఇప్పుడు రోడ్డుకెక్కడంతో ప్రతి ఒక్కరూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న మంచు ఫ్యామిలీ పరువు కాస్త పోయిందనే కామెంట్లు వ్యక్తపరుస్తున్నారు.
పరారీలో మోహన్ బాబు..
ఇదిలా ఉండగా జల్పల్లిలో మోహన్ బాబు(Mohan Babu) నివాసం వద్ద మోహన్ బాబు మీడియా మిత్రుడిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ దాడిలో ముక్కు నుంచి చెవికి అనుసంధానమైన ఎముక మూడు చోట్ల ఫ్రాక్చర్ అయింది. ఈ నేపథ్యంలోనే బాధితులు మోహన్ బాబు నుండి తమకు ప్రాణహాని ఉందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అటు జర్నలిస్టు సంఘాలు కూడా మోహన్ బాబు పై మండిపడ్డాయి. ఇక దీంతో జర్నలిస్టును గాయపరిచిన నేపథ్యంలో సెక్షన్ 118 BNS కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఆయనను అరెస్టు చేయాలని వెళ్లిన పోలీసులకు మోహన్ బాబు కనిపించలేదు. ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మోహన్ బాబు కోసం పోలీసులు ఐదు బృందాలుగా మారి గాలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు మోహన్ బాబు జాడ తెలియలేదు. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసలేం జరిగింది..?
ఇకపోతే రెండు రోజుల క్రితం జల్పల్లి లో మోహన్ బాబు (Mohan Babu)ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ముఖ్యంగా మంచు మనోజ్(Manchu Manoj) తన తండ్రి మోహన్ బాబు, తన అన్నయ్య మంచు విష్ణు (Manchu Vishnu)తనకు అన్యాయం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.. అంతేకాదు తన కుటుంబం నుంచి తనకు హాని ఉందని డీజీపీ, డీజీలను కలిసి ఇంటికి వస్తున్న నేపథ్యంలో మోహన్ బాబు ఇంటి వద్ద ఉన్న సెక్యూరిటీ వారిని లోపలికి అనుమతించలేదు. లోపల 7 నెలల పాప ఉందని బ్రతిమలాడినా ఒప్పుకోకపోయేసరికి మనోజ్ కోపంతో గేట్లు బద్దలు కొట్టుకొని ఇంట్లోకి రావడం, ఆ సమయంలో మోహన్ బాబు కోపంతో ఊగిపోయి మీడియా మిత్రులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ విషయంపై పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో మోహన్ బాబు పై కేసు ఫైల్ అయ్యింది. మీడియా మిత్రులు మోహన్ బాబు వల్ల తమకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇచ్చారు. ఇకపోతే ఇంటి వద్ద గొడవ ఒకవైపు.. మరొకవైపు మీడియా మిత్రులు పెట్టిన కంప్లైంట్ ఆధారంగా విచారణకు హాజరుకావాలని మోహన్ బాబు కు రాచకొండ పోలీసులు నోటీసులు పంపించారు. అయితే మనోజ్ తో గొడవ కారణంగా హై బీపీతో హాస్పిటల్ పాలైన మోహన్ బాబు.. అనారోగ్య పరిస్థితి కారణంగా హాజరు హాజరుకాలేను అంటూ వినతిపత్రం సమర్పించుకున్నారు.. ఇక ఆయన విచారణను ఈ నెల 24 కి వాయిదా వేసిన విషయం తెలిసిందే.