Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి హైకోర్టు మధ్యంతర బెయిల్ ను అందించిన విషయం తెల్సిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఇక బన్నీని నేటి ఉదయం చిక్కడపల్లి పోలీసులు.. ఇంటికి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అల్లు అర్జున్.. పోలీసులపై మండిపడ్డాడు. మీరు అరెస్ట్ చేయడం తప్పు కాదు కానీ, కనీసం బట్టలు మార్చుకొనే అవకాశం కూడా ఇవ్వకపోవడం కరెక్ట్ కాదని పోలీసులతో తెలిపాడు.
Poonam Kaur – Allu Arjun: బన్నీ అరెస్ట్.. సంచలన ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్..!
వైట్ కలర్ వింటర్ టీ షర్ట్ వేసుకొని బయటకు వచ్చిన బన్నీని పోలీసులు అరెస్ట్ చేసి.. గాంధీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు బన్నీని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో విచారణ జరిపిన అనంతరం న్యాయమూర్తి అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. కొద్దిసేపటిలో బన్నీ జైలుకు వెళ్తాడు అని ఆందోళనలో ఉన్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ తెలిపారు. అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు తీర్పు ఇచ్చింది.
ఇక ఇదంతా పక్కన పెడితే.. చాలామంది చూపు బన్నీ టీ షర్ట్ పైనే పడింది. అదేమీ సాధారణమైన డ్రెస్ కాదు. అసలు బన్నీ ఉన్న పరిస్థితి ఏంటి.. ? మీరు మాట్లాడే మాటలు ఏంటి.. ? అని కొందరు ప్రశ్నించినా.. నెటిజన్స్ మాత్రం దానికి పక్క ఆధారాలను పట్టుకొని రెడీగా కూర్చున్నారు. మొదట బన్నీ.. గ్రీన్ కలర్ షర్ట్, షార్ట్స్, చెప్పులు కూడా లేకుండా లిఫ్ట్ నుంచి కిందకు దిగాడు. ఆ తరువాత బట్టలు మార్చుకుంటానని చెప్పి డ్రెస్ మార్చాడు. అయితే అల్లాటప్పా డ్రెస్ కాకుండా తన బ్రాండ్ కు తగ్గట్లు డ్రెస్ వేసుకున్నాడు.
Nani: బ్రేకింగ్.. అల్లు అర్జున్ కు సపోర్ట్ గా నాని.. ట్వీట్ వైరల్
ఈ మధ్య కాలంలో బన్నీ ఎక్కడకు వెళ్లినా పుష్ప 2 లోని డైలాగ్స్ ఉన్న డ్రెస్ లనే వేసుకుంటున్నాడు. పుష్ప 2 లో కనుక ఇది సార్ నా బ్రాండ్ అని చూపించడానికి షర్ట్ మీద చేతి ముద్ర ఉండే డిజైనర్ షర్ట్ లను వేసుకున్నట్టే బయట కూడా అదే డ్రెస్లను వాడుతున్నాడు. ఇక ఈరోజు కూడా వైట్ కలర్ స్వేట్ టీ షర్ట్ పై హిందీలో ఫ్లవర్ కాదు.. ఫైర్.. వైల్డ్ ఫైర్.. తగ్గేదేలే అని రాసి ఉంది.
ఇంత హడావిడిలో కూడా బన్నీ.. ఈ బ్రాండ్ డ్రెస్ వేసుకోవడం ట్రోలర్స్ కు మరింత హైప్ ను ఇచ్చింది. జైలుకు వెళ్తున్నా అనుకున్నావా.. ప్రమోషన్స్ కు పోతున్నా అనుకున్నావా అన్నా అని కొందరు. కావాలనే బన్నీ ఈ డ్రెస్ వేసుకున్నాడు. ఇక్కడ కూడా పుష్పలా చుపించాలనుకున్నాడు.. అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం బన్నీ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.