Varun Tej Movie Update:..వరుణ్ తేజ్ (Varun tej ).. మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ మెగా కుటుంబం అండతో ఇండస్ట్రీలోకి వచ్చారు. సక్సెస్ అందుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఒకప్పుడు ‘ఫిదా’ లాంటి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన వరుణ్ తేజ్, ఆ తర్వాత నటించిన సినిమాలేవి కూడా ప్రేక్షకులను మెప్పించలేదు. ఇప్పటికే ఎన్నో జానర్లలో సినిమాలు చేశారు. కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అయితే లభించలేదు. అయినా సరే సినిమా ఇండస్ట్రీని వదలకుండా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు వరుణ్ తేజ్. వాస్తవానికి వరుణ్ తేజ్ తన ప్రతి సినిమా కోసం ఎంతో కష్టపడతారు. తన పాత్ర కోసం ఎంత రిస్క్ అయినా చేయడానికి ముందుకు వస్తారు. ప్రతిసారి కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు కానీ నిరాశే ఎదురవుతోంది. గత మూడు సినిమాలు గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా ఇలా వరుస చిత్రాలు పరాజయం అయ్యాయి. దానికి ముందు వచ్చిన ‘ఎఫ్3’ కూడా హిట్ కొట్టినా సరే ఫ్లాప్ గానే నిలిచిపోయింది.
బర్త్ డే రోజున కొత్త సినిమా ప్రకటించిన వరుణ్ తేజ్..
ఇప్పుడు మరో సరికొత్త సినిమాను ప్రకటించాడు వరుణ్ తేజ్. ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో చిత్ర బృందం కూడా వరుణ్ తేజ్ కి హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ.. కొత్త సినిమాని అనౌన్స్ చేస్తూ.. ఒక పోస్టర్ని రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో ఒక చిన్న కుండ ఉంది. కుండ పైన డ్రాగన్ బొమ్మ ఉంది. దాని చుట్టూ కొరియన్ భాషలో ఏవో అక్షరాలు కూడా ఉన్నాయి. అంతేకాదు కుండ చుట్టూ మంటలు కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఈ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ.. ఇండో – కొరియన్ హారర్ కామెడీ కథ అని చిత్ర బృందం ప్రకటించింది. ఈ పోస్టర్ ని బట్టి చూస్తే వరుణ్ తేజ్ హారర్ కామెడీ కథతో రాబోతున్నట్లు, ఇండియా – కొరియా దేశాలకు సంబంధించిన కథ అని మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ (SS. Thaman )సంగీతాన్ని అందిస్తున్నాడు. డైరెక్టర్ మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం.VT 15 అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
సక్సెస్ కోసం ఆరాటపడుతున్న డైరెక్టర్..
డైరెక్టర్ విషయానికి వస్తే గత మూడు చిత్రాలు కృష్ణార్జున యుద్ధం, మ్యాస్ట్రో, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చిత్రాలు యావరేజ్ గానే నిలిచాయి. దీనికి తోడు హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ డైరెక్టర్ మరొకవైపు సక్సెస్ కోసం ఆరాటపడుతున్న హీరోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈ ఇద్దరూ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో చూడాలి. కనీసం ఇప్పటికైనా వరుణ్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాలని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక అందరి అంచనాలు తగ్గట్టుగానే వరుణ్ తేజ్ మళ్లీ తన సినిమాతో ప్రేక్షకులను అలరించాలని కోరుతూ ఉండడం గమనార్హం. ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే.. ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya tripathi ) ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఈమెతో కలిసి మళ్ళీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. కానీ సరైన కథ కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం.
тнє нαυηтιηg ιѕ αвσυт тσ тυяη нιℓαяισυѕ
& the Epic Entertainment Awaits ❤️🔥Wishing a very happy birthday to the ever versatile Mega Prince @IAmVarunTej ❤️
Let’s spell something sensational with #VT15 ~ AN INDO-KOREAN HORROR COMEDY💥
Directed by @GandhiMerlapaka
A @MusicThaman… pic.twitter.com/B4DJxWZuRz— UV Creations (@UV_Creations) January 19, 2025