E-Paper
Advertisement

Maheshbabu – Rajamouli : ఆ 20 నిమిషాలు ప్రత్యేకమట.. అంచనాలు పెంచేస్తున్న జక్కన్న ప్లాన్..!

Maheshbabu – Rajamouli : ఆ 20 నిమిషాలు ప్రత్యేకమట.. అంచనాలు పెంచేస్తున్న జక్కన్న ప్లాన్..!
Advertisement

Maheshbabu – Rajamouli :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సెన్సేషన్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు రాజమౌళి (Rajamouli). ఈయన నుంచి వచ్చే ప్రతి సినిమాకి రెండు మూడు సంవత్సరాల సమయం పట్టినా.. కచ్చితంగా గ్లోబల్ రేంజ్ లో గుర్తింపు అయితే లభిస్తుంది. ఈ క్రమంలోనే రాజమౌళి చివరిగా ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram charan) కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమా ప్రపంచ స్థాయి గుర్తింపు అందుకోవడమే కాకుండా ఆస్కార్ అవార్డులను కూడా దక్కించుకుంది. బెస్ట్ లిరిక్స్ విభాగంలో చంద్రబోస్,మ్యూజిక్ విభాగంలో ఎమ్. ఎమ్.కీరవాణి ఇద్దరూ కూడా ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి నుంచి వచ్చే తదుపరి చిత్రం కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉండగా.. మహేష్ బాబుతో ఏకంగా పాన్ వరల్డ్ మూవీ ప్రకటించారు రాజమౌళి.

మహేష్ బాబుతో అదిరిపోయే ప్లాన్ చేసిన రాజమౌళి..

Advertisement

అయితే ఇలాంటి రాజమౌళి చేతిలో పడ్డ మహేష్ బాబు (Mahesh babu) ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. మహేష్ బాబు అంటేనే అందరికీ ముందుగా గుర్తొచ్చేది అందం. అందుకే ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆయన ఢీ గ్లామర్ గా నటించినట్లు దాఖలాలు లేవు. అలా నటిస్తే జనాలు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే సగం మంది జనాలు మహేష్ అందం చూడడం కోసమే థియేటర్ కి వస్తారు. అందుకే దర్శకులు కూడా ఈ విషయంపై ఎంతో క్లారిటీగా ఉంటూ మహేష్ బాబును మరింత అందంగా తెరపై చూపించే ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. మహేష్ బాబుకి ఒక టఫ్ సిట్యుయేషన్ ఎదురైందని తెలుస్తోంది. అసలు విషయంలోకెళితే.. ఈ సినిమాలో మహేష్ బాబు చేత రాజమౌళి విన్యాసాలు చేయించబోతున్నట్లు తెలుస్తోంది.

డూప్ లేకుండా నటించడానికి సిద్ధమైన మహేష్ బాబు..

Advertisement

రీసెంట్గా వైరల్ అవుతున్న వార్త విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఒక 20 నిమిషాల వైల్డ్ ఫైర్ అటాక్ సీన్ ఉంటుందని.. ఆ సీన్ కి థియేటర్స్ మొత్తం షేక్ అయిపోవాల్సిందే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సన్నివేశాల కోసం జక్కన్న ఎటువంటి డూప్ లేకుండా నిజమైన మంటల్లో మహేష్ బాబును నటింప చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొదట ఇలా నటించడానికి మహేష్ ఒప్పుకోనప్పటికీ, సీన్ గురించి క్లియర్గా వివరించడంతో మహేష్ బాబు కూడా చేస్తానని హామీ ఇచ్చారట. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సినిమాలో ఆ 20 నిమిషాలు మాత్రం చాలా ప్రత్యేకమని కచ్చితంగా ఆ పాత్రకు అవార్డు రావడం ఖాయం అని కూడా సినీ విశ్లేషకులు చెబుతున్నట్లు కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

మహేష్ బాబు సినిమాలు..

మహేష్ బాబు విషయానికి వస్తే.. చివరిగా ‘గుంటూరు కారం’ సినిమా చేసిన ఈయన, ఆ తర్వాత రాజమౌళి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. కానీ ఇంకా ఈ సినిమా పూర్తిస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావాలి అంటే ఇంకా రెండు మూడు సంవత్సరాలు పడుతుందని కూడా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×