E-Paper
Advertisement

Mohan Babu : మెగా ఫోన్ ప‌డుతున్న క‌లెక్ష‌న్ కింగ్!

Mohan Babu : మెగా ఫోన్ ప‌డుతున్న క‌లెక్ష‌న్ కింగ్!
Advertisement
Mohan Babu

Mohan Babu : టాలీవుడ్‌లో విల‌క్ష‌ణ న‌టుడిగా పేరున్న అతికొద్ది మంది సీనియ‌ర్ స్టార్స్‌లో మంచు మోహ‌న్ బాబు ముందు వ‌రుస‌లో ఉంటారు. హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా సినీ రంగంలో త‌న‌దైన ముద్ర వేసిన ఈ వెర్స‌టైల్ స్టార్ రాజ‌కీయాల్లోనూ రాణించారు. ఇప్పుడు పాలిటిక్స్‌కు దూరంగా ఉంటూ త‌న మోహ‌న్ బాబు యూనివ‌ర్సిటీ ప‌నుల‌తో బిజీగా ఉన్నారు. సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప‌రిమిత సంఖ్య‌లోనే ఆయ‌న సినిమాల్లో న‌టిస్తున్నారు. ఇప్పుడు కుమార్తె ల‌క్ష్మీ మంచు ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టిస్తోన్న అగ్ని ప‌ర్వ‌తం సినిమాలో మోహ‌న్ బాబు కీల‌క పాత్ర‌లో యాక్ట్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

కాగా.. మోహ‌న్ బాబు త్వ‌ర‌లోనే ఓ మూవీలో ప‌వ‌ర్‌ఫుల్ రోల్ చేయ‌బోతున్నార‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌నే రీసెంట్ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఒక‌ప్ప‌టి అసెంబ్లీ రౌడీ, రాయ‌ల‌సీమ రామ‌న్న చౌద‌రి త‌ర‌హా పాత్ర‌లో తాను న‌టించ‌బోతున్నాన‌ని చెప్పారు. క‌థంతా సిద్ధ‌మ‌వుతుంద‌ని కూడా ఆయ‌న అన్నారు. అయితే సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు.. మోహన్ బాబు న‌టించ‌బోతున్న ఈ మూవీకి ఆయ‌నే డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నార‌ని టాక్ వినిపిస్తోంది. నిర్మాణం కూడా ఆయ‌న సొంత బ్యాన‌ర్‌లో ఉంటుంద‌నటంలో సందేహం లేదు.

Advertisement

మోహ‌న్ బాబు ఇప్పుడు విద్యాసంస్థ‌ల‌కు సంబంధించిన ప‌నుల‌తోనే బిజీగా ఉన్నారు. మ‌రి త‌న కొత్త సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తార‌నే ఇప్పుడే చెప్ప‌లేమ‌ని టాక్‌. మ‌రి ఈ సినిమాలో ఆయ‌న వార‌సులు ల‌క్ష్మీ మంచు, విష్ణు, మ‌నోజ్ ఏమైనా న‌టిస్తారా? లేదా అనేది తెలియాలంటే వెయిటింగ్ త‌ప్పదు. ఆ మధ్య మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన సన్నాఫ్ ఇండియా డిజాస్టర్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. మరి ఈ సారి మోహన్ బాబు ఆడియెన్స్‌ని ఆకట్టుకోవటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని సినిమా చేస్తారో చూడాలి మరి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×