BigTV English

Chiranjeevi Deglamour movies: డీ గ్లామర్ పాత్రలలోనూ మెప్పించిన మెగా స్టార్

Chiranjeevi Deglamour movies: డీ గ్లామర్ పాత్రలలోనూ మెప్పించిన మెగా స్టార్

Megastar Chiranjeevi acted some deglamarous characters in Tollywood: ఏ నటుడైనా ఒకటే ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా విభిన్న పాత్రలు చేసి మెప్పిస్తేనే శాశ్వతంగా అభిమానుల గుండెల్లో ఉండిపోతాడు. ఒకప్పటి ఎన్టీఆర్, ఎఎన్ ఆర్ అలా అన్ని పాత్రలు చేసి మెప్పించినవారే. అయితే హీరో అనగానే చెదరని జుట్టు, నీట్ గా గెడ్డం చేసుకోవడం, మంచి డ్రెస్ వేసుకోవడం అవన్నీ ఒకప్పటి మాట. డీ గ్లామర్ పాత్రలు చేయడానికి సైతం భయపడే రోజులవి. అలాంటి రోజుల్లో స్వయంకృషితో ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండానే తన సొంత ట్యాలెంట్ తో టాప్ హీరో రేంజ్ కి ఎదిగిన చిరంజీవి పేరుకు తగ్గట్లుగానే సినీ కళారంగంలో శాశ్వతంగా చిరంజీవిగా పేరు తెచ్చుకున్నారు.అరుదైన డీ గ్లామర్ సినిమాలు చేసి అందరినీ మెప్పించారు. నేడు మెగా స్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన డీగ్లామర్ పాత్రలలో మెప్పించిన కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం..


ఆరాధనతో ఆదర్శవంతంగా..

అప్పుడే కమర్షియల్ హీరోగా ఎదుగుతున్న చిరంజీవి దొంగ, దొంగమొగుడు, రాక్షసుడు జేబుదొంగ వంటి సినిమాలతో యువ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అలాంటి రోజుల్లో ఓ ప్రయోగాత్మక చిత్రంతో నటించారు చిరంజీవి. 1987లో ఆరాధన చిత్రం భారతీ రాజా దర్శకత్వంలో నటించారు. భారతీ రాజా తన సినిమాలలో ఎవరికీ మేకప్ ఉండేందుకు ఇష్టపడరు. ముఖ్యంగా హీరోహీరోయిన్లు కూడా డీగ్లామర్ గా ఉండాలని కోరుకుంటారు. చిరంజీవి, సుహాసిని, రాజశేఖర్ కాంబినేషన్ లో ఆరాధన అనే మూవీని భారతీ రాజా దర్శకత్వంలో తానే నిర్మాతగా ఈ మూవీని తెలుగులో తీశారు. ఇందులో చిరంజీవి చదువు కోని ఓ మొరటోడు పాత్రలో జీవించారు. కానీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించలేదు. పూర్తి డీ గ్లామర్ పాత్రలో చిరంజీవి నటించారు.


చెప్పులు కుట్టుకునే పాత్ర

1987 సంవత్సరంలో కె.విశ్వనాధ్ దర్శకత్వంలో స్వయంకృషి మూవీలో నటించారు చిరంజీవి. ఆ సినిమాలో చెప్పులు కుట్టుకుని జీవించే సాంబయ్య పాత్రలో ఆదర్శవంతమైన యువకుడిగా నటించారు. ఈ మూవీని పూర్ణోదయా బ్యానర్ లో నిర్మించారు. ఈ చిత్రంలో చిరంజీవి చదువురాని సాంబయ్యగా నటించి మెప్పించారు. అయితే ఈ మూవీ కమర్షియల్ గా మెప్పించలేదు. డీగ్లామర్ గా నటించినా చిరంజీవికి మంచి పేరే తెచ్చిపెట్టింది.

రుద్రవీణలో సమాజ సేవకుడిగా..

1988 సంవత్సరంలో కె.బాలచందర్ దర్శకత్వంలో రుద్రవీణ మూవీ వచ్చింది. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో చిరంజీవి సోదరుడు నాగబాబు నిర్మాతగా ఈ మూవీని తీశారు. ఈ మూవీలో కూడా కమర్షియల్ అంశాలు ఏమీ ఉండవు. చిరంజీవి సూర్యనారాయణ శాస్త్రి ఇలియాస్ సూర్యం గా నటించారు. ఆయన తండ్రిగా జెమినీ గణేశన్ నటించారు. కొడుకును సంగీత విద్వాంసకుడిగా చూడాలని అనుకున్న తండ్రి గ్రామ స్వరాజ్యానికి పాటుపడే ఆదర్శ యువకుడిగా మారిన చిరంజీవి దారికే వస్తాడు చివరకు. ఈ మూవీకి జాతీయ అవార్డులు వచ్చాయి. కానీ ప్రేక్షకులు మాత్రం పెద్దగా ఆదరించలేదు.

పశువుల కాపరిగా

1992లో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో పూర్ణోదయా బ్యానర్ లో చిరంజీవి, మీనాక్షి శేషాద్రి జంటగా నటించిన మూవీ ఆపద్భాంధవుడు. ఓ పశువుల కాపరిగా, చదువురాని యువకుడి పాత్రలో..త్యాగానికి మారుపేరుగా నటించారు చిరంజీవి. క్లైమాక్స్ లో నత్తి పాత్రలో చిరంజీవి నటన హైలెట్ గా నిలచింది. ఈ మూవీకి గానూ చిరంజీవికి బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డును అందుకున్నారు. ఇలా కెరీర్ మొదట్లోనే డీ గ్లామర్ పాత్రలను జయాపజయాలతో సంబంధం లేకుండా చేసిన చిరంజీవి తర్వాత కాలంలో నెంబర్ వన్ స్థానాన్ని అందుకుని..ఇప్పటికీ యువ హీరోలకు గట్టిపోటీని ఇస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×