BigTV English

Wife Demands Alimony: భర్త నుంచి ప్రతినెలా రూ.6 లక్షలు భరణం డిమాండ్ చేసిన మహిళ.. మండిపడిన కోర్టు!

Wife Demands Alimony: భర్త నుంచి ప్రతినెలా రూ.6 లక్షలు భరణం డిమాండ్ చేసిన మహిళ.. మండిపడిన కోర్టు!

Wife Demands Alimony| భార్యాభర్తలు గొడవపడడం, విడాకులు తీసుకొని విడిపోవడం చాలా వరకూ చూస్తూనే ఉంటాం. అయితే ఈ మొత్తం వ్యవహారంలో భరణం అనే సమస్య వచ్చినప్పుడు అది అంత ఈజీగా పరిష్కారం కాదు. ఈ విషయంలో కొన్ని సార్లు పురుషులు అన్యాయంగా ప్రవర్తిస్తే.. కొన్ని సార్లు భార్యలు మాజీ భర్త నుంచి ముక్కు పిండి భరణం వసూలు చేయాలని చూస్తారు. ఈ రెండో కోవకు చెందిన ఓ మహిళ తన భర్త నుంచి భరణం ఇప్పించాలని ఇటీవల కోర్టులో కేసు వేసింది. అయితే తనకు ప్రతినెలా భరణం కింద రూ.6 లక్షలకు పైగా కావాలని డిమాండ్ చేసింది. అది చూసిన న్యాయమూర్తి మరీ ఇంత ఎందుకు కావాలో? చెప్పాలని అడిగితే.. సదరు భార్యామణి గారు చెప్పిన లెక్కలు విని జడ్జిగారు పెద్ద క్లాస్ పీకారు. ఈ ఘటన ఇటీవలే కర్ణాటక హైకోర్టులో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. కన్నడ జర్నలిస్ట్ దీపిక నారాయణ్ భరద్వాజ సోషల్ మీడియాలో ఇటీవల పోస్ట్ చేసిన ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియో ప్రకారం ఒక మహిళ తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. అయితే తన భర్తకు మంచి సంపాదన ఉందని చెబుతూ.. తన భర్త అనుభవిస్తున్న లగ్జరీ లైఫ్ కు సమానంగా తనకు కూడా జీవించే హక్కు ఉందని వాదించింది. ఆ మహిళ తరపున లాయర్.. ఆమె ఖర్చుల కోసం భరణం కింద ప్రతినెలా రూ.6,16,300 కావాలని చెప్పాడు. ఆ కోర్టులో ఒక మహిళా న్యాయమూర్తి గారు లాయర్ వాదనలని వారు సమర్పించిన డాక్యుమెంట్స్ ని పరిశీలించి.. ”ఇదేంటయ్యా.. ఆమెకు పిల్లలు లేరు, పెద్దగా అంత అవసరాలు లేవు. ప్రతినెల రూ.6 లక్షలు కావాలా?.. సరిగా చెప్పాలంటే రూ.6,16,300. ఇంత దేని కోసం అడుగుతున్నారు? అని ప్రశ్నించింది.

Also Read: ఫోన్లో ప్రియుడితో మాట్లాడుతుండగా పట్టుబడిన కొత్త పెళ్లికూతురు.. భర్త ఏం చేశాడంటే?


న్యాయమూర్తి గారి ప్రశ్నలకు ఆ లాయర్ చెప్పిన సమాధానం వింటే షాక్ అవ్వాల్సిందే. లాయర్ చెప్పిన ఖర్చులు ఇవే..

సదరు మాజీ భార్యకు మోకాలి నొప్పి చికిత్స కోసం ప్రతినెలా రూ.4 నుంచి రూ.5లక్షలు అవుతుందట. లాయర్ ఫీజు ప్రతినెలా రూ.50 వేలు చెల్లించాలట. ఆమె మాజీ భర్త ఖరీదైన బట్టలు వేసుకుంటాడు గనుక ఆమె కూడా మంచి బ్రాండెడ్ చెప్పులు, బట్టలు, గాజులు, మేకప్ కోసం నెలకు రూ.15 నుంచి రూ.20 వేలు కావాలట. ప్రతినెలా పౌష్టికాహారం కావాలి గనుక భోజనాల కోసం రూ.60 వేలు, అప్పుడప్పుడూ బయటకు వెళ్లి హోటళ్లలో తినాలి గనుక వాటి కోసం అదనపు ఖర్చు అవుతుంది గనుక అంతా కలిపి రూ.6 లక్షల 16 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.

ఇదంతా విని న్యాయమూర్తి గారికి చిరాకు వచ్చింది. న్యాయమూర్తి చట్టం గురించి వివరిస్తూ.. ”విడాకుల చట్టం సెక్షన్ 24 ప్రకారం.. భార్యాభర్తలలో ఒకరికి జీవనం సాగించేందుకు ఏ ఆదాయం లేకపోతే మరొకరు భరణం చెల్లించాలి. కానీ ఇక్కడ ఆమె అవసరాల కోసం ఎంత కావాలో చెప్పాలి గానీ లగ్జరీ లైఫ్ కావాలని డిమాండ్ చేయడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుంది. మీరు సరైన లెక్కలు చెబితే.. ఈ కేసు నిలబడుతుంది. ఇలా లక్షలకు లక్షలు కావాలి అని డిమాండ్ చేస్తే.. కేసు రద్దు చేస్తాను. ఒకవేళ ఆమెకు అన్ని లక్షలు కావాలంటే స్వయంగా పనిచేసి సంపాదించుకోమనండి. ఇలా మాజీ భర్తలను భరణం పేరుతో వేధించాలనుకుంటే కుదరుదు.” అని చెప్పారు.

Also Read:  ‘నా ఇష్టం మీకేంటి?’.. 16 ఏళ్ల అబ్బాయిని డేట్ చేస్తున్న 21 ఏళ్ల భామ..

ఆ తరువాత ఆ భర్త తరపున లాయర్ వాదిస్తూ.. సెక్షన్ 24 ప్రకారం.. ”ఏ ఆదాయం లేని భార్య లేదా భర్త మాత్రమే భరణం కోసం కోర్టులో పిటీషన్ వేయాలి. కానీ సదరు మాజీ భార్యగారి పేరున రూ.63 లక్షల కంపెనీ షేర్లున్నాయి. వాటి ద్వారా ఆమెకు ఆదాయం సమకూరుతోంది. కావాలంటే ఆధారాలుగా బ్యాంక్ స్టేట్ మెంట్ చూడండి” అని చెప్పారు. ఇంకేముంది న్యాయమూర్తి గారు కోపంతో మహిళ లాయర్ వైపు చూడగా.. ”లేదు లేదు యువర్ ఆనర్ ఈ భరణం నిజంగానే ఆమె కనీస అవసరాల కోసమే అని రుజువు చేయగలను” అని ఆ మహిళ తరపు లాయర్ చెప్పగానే .. న్యాయమూర్తి గారు ”చాలు ఇక ఆపండి. కోర్టుని మోసం చేయాలని చూస్తున్నారా? మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. సరైన లెక్కలు చూపండి ఆమె బ్యాంక్ స్టేట్ మెంట్ కూడా సమర్పించండి లేదా కేసు రద్దు అవుతుంది” అని కోపంగా చెప్పి వాయిదా వేశారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×