Megastar Chiranjeevi.. Allu family check the rumours..meet at blood bank: ఆ రెండు ఫ్యామిలీలు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఓ మలుపు తిప్పినవారే. దాదాపు ఎనిమిది దశాబ్దాల టాలీవుడ్ చరిత్రలో వీరి ఫ్యామిలీ 40 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉంది. దానికి తోడు ఇరు ఫ్యామిలీల మధ్య బంధుత్వం కూడా ఉంది. వారెవరో కాదు.. ఒకరు తెలుగు సినీ చరిత్రలో తొలి సారి రియల్ ఫైట్లు, బ్రేక్ డ్యాన్సులు తీసుకొచ్చి సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి. ఇంకొకరు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి సూపర్ హిట్ కమర్షియల్ సినిమాల నిర్మాతగా పేరు తెచ్చుకున్న అల్లు అరవింద్. అల్లు అరవింద్ చెల్లెలు సురేఖను చిరంజీవి వివాహం చేసుకున్నాక వీరి బంధం మరింత బలపడింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఎలాంటి అరమరికలు లేకుండా ఉంటున్నారు.
రెండు కుటుంబాల మధ్య?
ఎవరింట్లో ఫంక్షన్ వచ్చినా ఒకరినొకరు ఆప్యాయంగా కలుసుకుంటారు. అలాంటిది ఈ మధ్య కాలంలో ఈ రెండు కుటుంబాల మధ్య ఏవో గొడవలు జరుగుతున్నాయంటూ కొందరు అదే పనిగా గాసిప్ వార్తలు రాస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలోనూ పవన్ కళ్యాణ్ అఖండ విజయం సాధించి మంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. ఆ వేదికపైనా అల్లు ఫ్యామిలీ ఎవరూ కనిపించలేదు. దానికి తోడు ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రస్తుత సినిమాలపై మాట్లాడుతూ దొంగలు, స్మగ్లర్లను హీరోలుగా చూపిస్తున్నారంటూ వ్యాఖ్యానించడంతో అది పరోక్షంగా అల్లు అర్జున్ పుష్ప గురించే కామెంట్ అని మీడియా ప్రతినిధులు కొందరు వీళ్ల గొడవలకు మరింత ఆద్యం పోశారు.గతంలోనూ అల్లూ స్టూడియో ప్రారంభోత్సవానికి కేవలం చిరంజీవి దంపతులు తప్ప మిగిలిన మెగా హీరోలెవరూ రాలేదు. ప్రతి సినిమా ఈవెంట్ లోనూ మెగా హీరోలకు మీడియా నుంచి పలు ప్రశ్నలు ఎదురవుతుంటాయి. అల్లు వారి ఫంక్షన్ లో పవన్ గురించి అడుగుతారు. అలాగే చిరంజీవి, పవన్ సినిమాల ఫంక్షన్లలో అల్లు అర్జున్ గురించి మాట్లాడుతుంటారు. వాటన్నింటినీ విని ఎంతో ఓపికకగా సమాధానాలు చెబుతుంటారు చిరంజీవి.
ప్రజారాజ్యం కార్యక్రమాలకు పవన్ దూరం
ఏనాడూ సంయమనం కోల్పోలేదు. అల్లు అర్జున్ కూడా చాలా సందర్భాలలో తన మావయ్య చిరంజీవి వలనే తనకు ఈ నాడు ఇంతటి క్రేజ్ అంటూ చెబుతుండేవారు. అయినా ట్రోలింగులు చేసేవాళ్లు వాళ్ల పని వాళ్లు చేసుకుంటూనే ఉన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అల్లు అరవింద్ కీలకంగా వ్యవహరించేవారు. అది నచ్చకే పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లు ఉండేవారని అంటుంటారు. తర్వాత జనసేన పార్టీ స్థాపించిన తర్వాత అల్లు అరవింద్ ఆ పార్టీ వ్యవహారాలలో ఏనాడూ జోక్యం చేసుకోలేదు. ఇదిలా ఉండగా ఇటీవల ఆ గాసిప్స్ కు చెక్ పెడుతూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి.
బ్లడ్ బ్యాంక్ లో కలిసిన బ్లడ్ రిలేషన్
మొన్నటి ఆగస్టు 15న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం వేడుక జరిగింది. ఈ ఫంక్షన్ కు అల్లు అరవింద్ తన మనవరాలు, అల్లు అర్జున్ కుమార్తె అర్హ తో వచ్చారు. క్యూట్ డ్రెస్ లో బేబీ అర్హ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిరంజీవి కూడా అర్హను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా పలకరించారు. దీనితో ఇప్పుడిది ట్రెండింగ్ గా మారింది. జనం విమర్శలకు చెక్ పెట్టినట్లయింది. ఎప్పటికైనా తాము ఒకటే అని నిరూపించినట్లయింది. దీనితో మెగా ఫ్యాన్స్ హమ్మయ్య గొడవలన్నీ సమసిపోయాయని ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటనతో అయినా విమర్శకుల నోళ్లు మూతపడతాయని భావిస్తున్నారు మెగా ఫ్యామిలీ మెంబర్స్.