E-Paper
Advertisement

Atal Setu bridge: అటల్ సేతు బ్రిడ్జిపై మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన డ్రైవర్, పోలీసులు

Atal Setu bridge: అటల్ సేతు బ్రిడ్జిపై మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన డ్రైవర్, పోలీసులు
Advertisement

Atal Setu bridge: ముంబైలో అటల్ సేతు‌బ్రిడ్జి ఆత్మహత్యలకు కేరాఫ్‌గా మారిందా? అక్కడికే వచ్చి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఫ్యామిలీ సమస్యలా? అప్పుల బాధలా? ఇవే ప్రశ్నలు ముంబై వాసులను వెంటాడుతున్నాయి. తాజాగా 56 ఏళ్ల మహిళను కారు డ్రైవర్, పోలీసులు కాపాడారు. దీనికి సంబంధించిన ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది.

శుక్రవారం రాత్రి ఏడు గంటలు దాటింది. ముంబైలో అటల్‌సేతు బ్రిడ్జిపై ఓ కారు వచ్చి ఆగింది. కారు డ్రైవర్ రోడ్డుపై నిలబడగా, అందులోవున్న 56 ఏళ్ల మహిళ సైడ్ కూర్చొంది. మరి ఏం జరిగిందో తెలీదుగానీ సముద్రంలోకి దూకే ప్రయత్నం చేసింది. వెంటనే కారు డ్రైవర్ ఆమె జుట్టు పట్టుకున్నాడు.

Advertisement

ఈలోగా పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెని కాపాడారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. ఆ మహిళను అక్కడి నుంచి నవీ ముంబైలోని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. డీటేల్స్ సేకరించిన పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు కబురు పెట్టారు.

ALSO READ:  కీలక ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. క్యాబినెట్ ఆమోదం

Advertisement

ఈ వ్యవహారంపై ట్రాఫిక్ పోలీసులు నోరు విప్పారు. అటల్ సేతు బ్రిడ్జిపై కారు ఆపి ఓ మహిళ ఏదో చేస్తోందంటూ ఫోన్‌కాల్ రావడంతో వెంటనే పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకున్నట్లు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ పేరు రీమా పటేల్. గృహిణి కూడా. ముంబై ఈశాన్యంలోని ములుంద్ ప్రాంతంలో ఉంటోంది. ఆమె చనిపోవడానికి గల కారణాలు ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది.

20 రోజుల వెనక్కి వెళ్తే.. జూలై 25న ముంబైలోని 38 ఏళ్ల సాప్ట్‌వేర్ ఇంజనీర్ కరుతురి శ్రీనివాస్ అటల్ బ్రిడ్జిపైకి కారుతో వచ్చి వెంటనే అందులోకి దూకేసి సూసైడ్ చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు కారణంగానే జరిగిందని తేలింది.

అంతకుముందు మార్చి 18న థానే జిల్లాకు చెందిన 38 ఏళ్ల మహిళా డాక్టర్ సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎనిమిదేళ్లుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నానని ఆమె ఇంట్లో దొరికిన లేఖలో బయటపడింది. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో ప్రస్తావించింది.

 

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×