BigTV English

Vishwambhara: చిరంజీవి ‘విశ్వంభర’ మూవీకి కష్టాలు.. వాళ్లని వెతుకుతున్న మూవీ యూనిట్

Vishwambhara: చిరంజీవి ‘విశ్వంభర’ మూవీకి కష్టాలు.. వాళ్లని వెతుకుతున్న మూవీ యూనిట్

Chiranjeevi Vishwambhara movie


Chiranjeevi Vishwambhara movie(Telugu cinema news): మెగాస్టార్ చిరంజీవి 68 ఏళ్ల వయసులో కూడా సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఏ విషయంలోనూ వెనక్కి తగ్గడం లేదు. యంగ్ హీరోలతో సమానంగా పలు సినిమాలు చేస్తూ అదరగొడుతున్నాడు. తనను ఎంతగానో అభిమానించే ప్రేక్షకులకు, అభిమానులకు మంచి ఎనర్జీ అందిస్తున్నాడు.

ఇక గతేడాది ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపాడు. ఆ తర్వాత దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్‌లో ‘భోళా శంకర్’ తీశాడు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేసి బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలింది.


ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న చిరంజీవికి, అటు అభిమానులకు ఈ మూవీ పెద్ద నిరాశని మిగిల్చింది. దీంతో చిరు తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కాన్సెప్ట్ కొత్తగా.. ఢిఫరెంట్ జానర్‌లో ఉంటేనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. లేకపోతే నిర్ముహమాటంగా నో చెప్పేస్తున్నాడు.

READ MORE: మెగాస్టార్ ‘విశ్వంభర’లో మరో హీరోయిన్.. ఛాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ!

ఇక ఇందులో భాగంగా తనకు ఓ కథ తెగ నచ్చేయడంతో.. ఇప్పుడు ఆ మూవీని చేస్తున్నాడు. ‘బింబిసార’ ఫేం వశిష్ట డైరెక్షన్‌లో ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీని దర్శకుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ టీజర్ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. ఇకపోతే ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా సీనియర్ హీరోయిన్ త్రిషను తీసుకున్నారు. దీంతో ఈ మూవీకి మరింత జోష్ పెరిగింది. సెకండ్ టెర్మ్‌లో త్రిష తన అందంతో కుర్రకారుని బుట్టలో వేసుకుంది. దీంతో ఈ భామ ఇప్పుడు చిరు మూవీలో నటిస్తుండటంతో అంచనాలు పెరిగిపోయాయి.

కాగా ఇందులో చిరుతో పాటు తమిళ స్టార్ హీరో శింబు కూడా భాగం కాబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన చర్చలను శింబుతో జరపగా అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ వార్త వైరల్‌గా మారింది. ఈ మూవీ యూనిట్‌కి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడిందట. అదేంటంటే..

READ MORE: చిరు కెరీర్‌లోనే రికార్డ్ రేటుకు ‘విశ్వంభర’ ఓవర్ సీస్ రైట్స్ ?

ఈ సినిమాలో మెగాస్టార్ చిరుకి ఏకంగా ఐదుగురు చెల్లెళ్లు ఉంటారని తెలుస్తోంది. సురభి, ఆషికా రంగనాథ్, ఇషా చావ్లాతో సహా మరికొంతమంది ఈ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. అందువల్ల ఇప్పుడు వీళ్లకి జోడీగా ఎవరిని తీసుకోవాలో అనే సందిగ్ధంలో మూవీ యూనిట్ పడినట్లు తెలుస్తోంది.

కొంతమంది హీరోలను పరిశీలిస్తున్నారట.. అందులో రాజ్ తరుణ్, సుశాంత్ వంటి యంగ్ హీరోలతో పాటు మరికొంత మందిని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది 2025లో సంక్రాంతి కానుకగా జనవరి 25న రిలీజ్ కానుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×