KA Movie: రాజావారు రాణిగారు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) తాజాగా అదే సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్య ఘోరక్(Rahasya Ghorak) తో ఏడడుగులు వేశారు. ఇక వివాహం అనంతరం ఈయన నటించిన చిత్రం క (KA Movie). దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా.. మొదట యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ప్రమోషన్స్ బాగా చేపట్టడంతో ఈ సినిమా భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతోంది. అంతేకాదు దీపావళి హిట్ గా నిలిచింది ఈ సినిమా.
క సినిమాపై చిరంజీవి ప్రశంసలు..
అయితే తాజాగా ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)ప్రశంసలు కురిపించడం చిత్ర బృందాన్ని ఫుల్ ఖుషీ చేసిందని చెప్పవచ్చు. దీపావళి విన్నర్ గా నిలిచిన ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి అభినందనలు అందించారు. సినిమా చూసిన ఆయన సినిమా చిత్ర బృందానికి నా బ్లెస్సింగ్స్ అంటూ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు ఈ సందర్భంగా చిరంజీవికి తమ కృతజ్ఞతలు తెలిపారు ‘ క ‘ సినిమా బృందం.
సినిమా తారాగణం..
ఇకపోతే ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించగా.. నయన్ సారిక, తన్వి రామ్ హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రాన్ని శ్రీమతి చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణారెడ్డి భారీ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించడం జరిగింది. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి ఈ సినిమాను విడుదల చేశారు.
క సినిమా స్టోరీ..
అభినయ వాసుదేవ్ క్యారెక్టర్ లో నటించారు కిరణ్ అబ్బవరం. ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే.. అభినయ వాసుదేవ్ ఒక అనాథ. చిన్నప్పుడు ఒకసారి అనుకోకుండా ఎవరికో వచ్చిన ఉత్తరాన్ని చదువుతాడు. అయితే ఆ సమయంలో ఒక తల్లి కొడుకుకు రాసిన ఉత్తరం అది. తన తల్లి కూడా బ్రతికి ఉండి ఉంటే తనకి కూడా అలాంటి ఉత్తరాలే వచ్చేవి కదా అని, ఉత్తరం చూసి ఎమోషనల్ అవుతాడు. ఇక ఆ తర్వాత అలాంటి ఎమోషన్ పొందడానికి తరచూ ఉత్తరాలు చదవడం అలవాటుగా చేసుకుంటారు. ఉత్తరాల్లోనే అమ్మ, నాన్న, అన్నయ్య, చెల్లెమ్మ ని వెతుక్కుంటూ ఉంటారు. అభినయ వాసుదేవ్ పెరిగి పెద్దవాడై క్రిష్ణగిరి అనే ఒక మారుమూల పల్లెటూర్లో అసిస్టెంట్ పోస్ట్మాన్ గా ఉద్యోగం సంపాదించుకుంటారు. ఇక తర్వాత అక్కడ మనుషులకు కనెక్ట్ అయిపోతారు. అయితే ఉత్తరాలు చదివే అలవాటు ఉన్న ఈయనకు సడన్ గా ఆ ఊర్లో అమ్మాయిలు మాయం అవుతూ ఉంటారు. దానికి సంబంధించిన ఒక చిన్న క్లూ ఉత్తరం ద్వారా లభిస్తుంది. ఇక ఆ క్లూ పట్టుకుని ఆ మిస్టరీ ఎలా ఛేదించాడు..? అసలు అమ్మాయిల మిస్సింగ్ వెనుక ఉన్నది ఎవరు అనే విషయాలు అభినవ వాసుదేవ్ తెలుసుకున్నాడా అనే విషయం తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇకపోతే ఈ సినిమా సీక్వెల్ కూడా ఉంటుందని, త్వరలోనే ప్రారంభిస్తామని ఇటీవల కిరణ్ అబ్బవరం క మూవీ సక్సెస్ మీట్ లో వెల్లడించారు. మరోవైపు చిరంజీవి ఈ సినిమా పై ప్రశంసలు కురిపించడంతో అనుకోకుండానే ప్రమోషన్స్ జరిగి సినిమాపై హైప్ పెరిగిందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.