Lipstick Shades: లిప్‌స్టిక్ మీ పెదాలను అందంగా మార్చడమే కాకుండా మొత్తం ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. అందుకే సరైన లిప్ స్టిక్ షేడ్స్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీ చర్మం రంగు, వయస్సు ప్రకారం లిప్ స్టిక్ కలర్స్ సెలక్ట్ చేసుకోవాలి. స్కిన్ టోన్‌కి సరిపోయే లిప్ స్టిక్ వాడితే మీ అందం రెట్టింపు అవుతుంది. అంతే కాకుండా వయస్సు తక్కువగా కనిపించేలా చేస్తుంది.
లైట్ కలర్స్ 25-30 సంవత్సరాల వయస్సులోపు వారికి చాలా బాగా కనిపిస్తాయి. ఈ షేడ్స్ మీ పెదాలను అందంగా మార్చడమే కాకుండా మిమ్మల్ని యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.మరి ఏ ఏ కలర్స్ ఎవరికి ఎక్కువగా సెట్ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం
మహిళలు ఉన్న వయస్సు కంటే యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. అందుకోసం ముఖ్యంగా సరైన లిప్ స్టిక్ షేడ్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
5 లిప్‌స్టిక్ షేడ్స్ మిమ్మల్ని యవ్వనంగా మార్చడంలో చాలా సహాయపడతాయి.
న్యూడ్ షేడ్స్ ఎలాంటి వారికైనా సరిగ్గా సరిపోతాయి. ఇవి మీ పెదాలకు సహజమైన రూపాన్ని అందిస్తాయి. మీ ముఖాన్ని మెరుగుపరుస్తాయి.ఇవి ఆఫీసు, కాలేజ్ పార్టీలకు సరిపోతాయి. మీరు మీ స్కిన్ టోన్ ప్రకారం న్యూడ్ షేడ్‌ని ఎంచుకుంటే, మీరు మీ వయస్సు కంటే 5 సంవత్సరాలు చిన్నగా కనిపిస్తారు.
పీచ్ కలర్స్:
పీచ్ కలర్ లిప్ స్టిక్ షేడ్ ప్రతి ఒక్కరి స్కిన్ టోన్ పై అందంగా కనిపిస్తుంది. ఇవి రొమాంటిక్ కలర్స్. ఇవి మీ ముఖానికి బ్రైట్ లుక్ ఇస్తాయి. అంతే కాకుండా మిమ్మల్ని యంగ్ గా కనిపించేలా చేస్తాయి.
కాపర్ బ్రౌన్ లిప్‌స్టిక్ :
ఈ కలర్ అన్ని వయసుల మహిళలకు అందంగా కనిపిస్తుంది. ఈ రంగు చాలా తేలికగా ఉండదు. ఈ షేడ్ మీ రూపానికి క్లాసీ , స్టైలిష్ టచ్‌ని ఇస్తుంది. అంతే కాకుండా మిమ్మల్ని తక్కువ వయస్సు వారిలా కనిపించేలా చేస్తుంది.
పింక్ కలర్ :
ఈ లిప్‌స్టిక్ షేడ్ దాదాపు ప్రతి స్కిన్ టోన్‌కు బాగుంటుంది మీరు మీ వయస్సు కంటే యవ్వనంగా కనిపించాలనుకుంటే, ఈ లిప్‌స్టిక్ షేడ్ మీ మేకప్ కిట్‌లో తప్పకుండా ఉంచుకోండి.
ముదురు ఎరుపు:
ప్రతి అమ్మాయి మేకప్ బ్యాగ్‌లో ముదురు ఎరుపు రంగు లిప్‌స్టిక్ ఉండాలి. ఈ రంగు మీ పెదాలను అందంగా మార్చడమే కాకుండా, మీ రూపాన్ని బోల్డ్‌గా, ఆకర్షణీయంగా మార్చడం ద్వారా వయస్సును తగ్గిస్తుంది.
ఈ ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోండి:
సహజ లిప్ స్టిక్ షేడ్స్ ఎంచుకోండి. బ్రైట్, బోల్డ్ లిప్‌స్టిక్ షేడ్స్ మిమ్మల్ని మీ వయస్సు కంటే పెద్ద వారిలా కనబడేలా చేస్తాయి. అందుకే గులాబీ , రెడ్ వంటి సహజమైన షేడ్స్ ఎంచుకోండి. ఇవి మీరు యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
మీరు మీ వయస్సు కంటే పెద్ద వారిలా కనిపించకూడదనుకుంటే, మాట్ లిప్‌స్టిక్‌ను ఉపయోగించడం మానుకోండి, ఎందుకంటే ఇవి మీ పెదవులు పొడిగా, ఫ్లాట్‌గా కనిపించేలా చేస్తాయి. అందుకే వీటికి బదులుగా, మీ పెదవులు మెరిసేలా, మీరు యవ్వనంగా కనిపించేలా చేసే క్రీమీ లేదా శాటిన్ లిప్‌స్టిక్‌ను ఎంచుకోండి.
Also Read: మీ ముఖం అందంగా మెరిసిపోవాలా ? అయితే ఈ ఫేస్ మాస్క్ ట్రై చేయండి
మీ పెదాలను క్రమం తప్పకుండా ఎక్స్‌ఫోలియేట్ చేయండి. ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల మీ పెదాల నుండి డెడ్ స్కిన్ తొలగిపోతుంది.అంతే కాకుండా మీ పెదవులు మృదువుగా మారతాయి. మీకు కావాలంటే, మీరు మీ పెదాలను యవ్వనంగా మార్చడానికి ఎక్స్‌ఫోలియేటర్ కొనుగోలు చేయవచ్చు. లేదా టూత్ బ్రష్ సహాయంతో వాటిని తేలికగా స్క్రబ్ చేయవచ్చు.
పెదవులు పొడిబారకుండా, పగుళ్లు రాకుండా వాటిని క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ చేయడం కూడా చాలా ముఖ్యం. దీని కోసం లిప్ స్టిక్ వేసుకునే ముందు పెదవులపై లిప్ బామ్ లేదా దేశీ నెయ్యి కూడా రాసుకోవచ్చు.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.