Megastar Chiranjeevi speech at zebra Pree Release Event: మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఫిలిం ఇండస్ట్రీని గత నాలుగు దశాబ్దాలుగా శాసిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ను చూసి ఇన్స్పైర్ అయి చాలామంది నటులుగా కెరియర్ స్టార్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి గ్రేస్ గురించి టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ కమర్షియల్ సినిమాలు ఉన్నాయి. అప్పటివరకు సాఫీగా సాగిపోతున్న సినిమాను ఒక కొత్త పుంతలు తొక్కించిన ఘనత మెగాస్టార్ చిరంజీవికి ఉంది. ఇప్పటికీ మెగాస్టార్ డాన్స్ అంటే చాలామంది ఎంజాయ్ చేస్తారు. అలానే మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో మెగాస్టార్ కామిక్ టైమింగ్ కి ఫిదా అయిపోయిన ఆడియన్స్ ఉన్నారు.
కేవలం ఆన్ స్క్రీన్ లో మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా మెగాస్టార్ టైమింగ్ అదిరిపోతుంది. దీనికి ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. మెగాస్టార్ కొన్ని సందర్భాల్లో స్టేజ్ పైన మాట్లాడుతున్నప్పుడు కామెడీ టైమింగ్ బయటకు వస్తూ ఉంటుంది. కొన్ని ఇంటర్వ్యూస్ లో మాట్లాడినప్పుడు కూడా కామెడీ టైమింగ్ ఈజీగా బయట పడిపోతుంది. ఆ టైమింగ్ ను ఉపయోగించుకొని చాలామంది దర్శకులు పర్ఫెక్ట్ సినిమాలను మెగాస్టార్ చిరంజీవి కెరీర్ కు ప్లాన్ చేశారు. శంకర్ దాదా ఎంబిబిఎస్, అందరివాడు, జై చిరంజీవ వంటి సినిమాలలో మెగాస్టార్ కామెడీని విపరీతంగా ఆడియన్స్ ఇష్టపడ్డారు.
ఇక రీసెంట్ గా సత్యదేవ్ నటించిన జీబ్రా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా నవంబర్ 22న రిలీజ్ కి సిద్ధమవుతుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్ లో మాట్లాడుతున్న తరుణంలో ఒక అభిమాని.. బాసు నీ గురించి వైజాగ్ నుంచి వచ్చాను, నేను కలుద్దామని వైజాగ్ నుంచి వచ్చాను అంటూ అరిచాడు. ఆ మాటలకు స్పందించిన మెగాస్టార్ వెంటనే వైజాగ్ స్లాంగ్ లో “అయితే ఏటంటావ్ ఇప్పుడు, సైలెంట్ గా ఉండు రా బాబు కొన్ని నిమిషాలు, మన హీరోది కూడా వైజాగే అక్కడ ఈ సినిమాను ఆడించాలి మీరే” అంటూ ఒక్కసారిగా వాల్తేరు వీరయ్య క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోయారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ లో ఎప్పుడు నుంచి మిస్ అవుతున్న కామెడీ టైమింగ్ ను బయటకు తీసాడు బాబి. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఫిలిమ్స్ అన్నిట్లో కంటే వాల్తేరు వీరయ్య విపరీతంగా ఆకట్టుకుంది. మెగాస్టార్ నుంచి ఎక్స్పెక్ట్ చేసి కామెడీ టైమింగ్, డాన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా అద్భుతంగా ఈ సినిమాలు ప్లాన్ చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు బాబి.