Prashant Verma About Megastar Chiranjeevi: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరి జాతకం అయినా ఒక శుక్రవారం మార్చేస్తుంది అంటారు. ఒక శుక్రవారం ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడితే ఆ హీరోని వెతుక్కుంటూ పదిమంది ప్రొడ్యూసర్లు అడ్వాన్సులు పట్టుకొని వస్తారు. అదే హీరో ఒక డిజాస్టర్ పడితే వచ్చిన అడ్వాన్సులు కూడా వెనక్కి తీసుకునే రోజులు. కొన్నిసార్లు కొన్ని సినిమాలకు సరైన థియేటర్స్ కూడా దొరకవు. అదే సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ అయితే ఉన్నట్టుండి థియేటర్లు పెరుగుతాయి. అలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా సినిమాలకు జరిగాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తేజ సజ్జ నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది.
Also Read : ZEBRA Trailer: జీబ్రా.. మరో లక్కీ భాస్కర్ ను తలపిస్తుందేంటి.. ?
2024 సంక్రాంతికి సంబంధించి చాలా పెద్ద సినిమాలు పోటీలో వచ్చాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా విడుదలైంది. ఈ కాంబినేషన్ కి ఎంత క్రేజ్ ఉంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదివరకు వీరి కాంబినేషన్లో వచ్చిన అతడు ఖలేజా వంట సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయాయి. గుంటూరు కారం సినిమాతో కచ్చితంగా కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని ఉద్దేశంతో సంక్రాంతి రిలీజ్ కి సిద్ధమయ్యారు. అలానే విక్టరీ వెంకటేష్ నటించిన సైందవ్. అక్కినేని నాగార్జున నటించిన నా సామిరంగా సినిమాలు కూడా విడుదలయ్యాయి. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. మిగతా రెండు సినిమాలకు కూడా టాక్ అంతంత మాత్రమే వచ్చింది. కానీ హనుమాన్ సినిమాకు మాత్రం విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చింది.
Also Read : Producer Ravi about Megastar Chiranjeevi: ఆయన గెస్ట్ గా వచ్చిన రెండు సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేసాయి
హనుమాన్ సినిమాకి సంబంధించి మొదట సరైన థియేటర్స్ కూడా దొరకలేదు. కానీ దొరికిన కొన్ని థియేటర్స్ నుండి మాత్రం పాజిటివ్ టాక్ రావడంతో రోజురోజుకు ఆ సినిమాకి థియేటర్స్ పెరిగాయి. చాలామంది చిన్న పిల్లలు ఫ్యామిలీతో పాటు ఆ సినిమాను ఎంజాయ్ చేశారు. థియేటర్స్ చాలావరకు హౌస్ ఫుల్ అయ్యాయి. మొత్తానికి ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ రేంజ్ విపరీతంగా మారిపోయింది. ఇప్పుడు ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో కి పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా జాయిన్ అవ్వడం మొదలుపెట్టారు. ఇక ఇదే విషయాన్ని ప్రశాంత్ మాట్లాడుతూ… “హనుమంతుల వారు ధ్రువనగిరి పర్వతాన్ని ఎత్తినట్లు మా సినిమాని మెగాస్టార్ చిరంజీవి లేపారు” అని చెప్పుకొచ్చాడు. హనుమాన్ సినిమా ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన హాజరవడం కూడా సినిమాకు కొంతమేరకు ప్లస్ అయింది.