CM Revanth Reddy React: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడిపై తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రియాక్ట్ అయ్యారు. దాడులను తీవ్రంగా ఖండించిన సీఎం, దీనివెనుక ఎవరున్నా వదిలేది లేదని, ఎంతటివారైనా ఊచలు లెక్క పెట్టాల్సిందే నన్నారు.
దాడులు చేసినోళ్లను, చేయించినోళ్లను వదిలేదని తేల్చి చెప్పేశారు. ఇలాంటి దాడులు బీఆర్ఎస్ నేతలపై జరిగితే కేటీఆర్ సమర్థిస్తారా అంటూ ప్రశ్నించారు ముఖ్యమంత్రి. అధికారులపై దాడులను బీఆర్ఎస్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.
దాడి చేసిన వారిని ఎలా పరామర్శిస్తారు? అంటే దాడులను ప్రోత్సహించడమేనా? అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. అధికారులపై దాడులకు పాల్పడ్డవారిని బీఆర్ఎస్ ఏ రకంగా సమర్ధిస్తుందన్నారు. అందరి సంగతి తేలుస్తామన్నారు. రేపటిరోజున బీఆర్ఎస్ నేతలపై దాడులు జరిగితే కూడా ఇలాగే స్పందిస్తారా? అని కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
కంపెనీల కోసం భూ సేకరణ చేయాలా వద్దా? అనే దానిపై బీఆర్ఎస్ సహా ఎవరైనా అభిప్రాయం చెప్పొచ్చన్నారు. భూమి కోల్పోతున్నవాళ్లు నిరసన తెలపవచ్చని, అందులో ఏ మాత్రం తప్పులేదన్నారు. కానీ, అధికారుల మీద పాశవికంగా దాడి చేసి, చంపేందుకు ప్రయత్నించడాన్ని బీఆర్ఎస్ ఏ విధంగా సమర్థించుకుంటుందని ఫైర్ అయ్యారు. లగచర్ల ఘటన పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందన్నారు హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ. అధికారులపై కర్రలు, రాళ్లతో దాడుల వెనుక కుట్ర ఉందని వెల్లడించారు.
ALSO READ: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. 11 బోగీలు బోల్తా
మంగళవారం రాత్రి ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి, పదేళ్లు అన్యాయం చేశారని మీపై ఎవరైనా దాడి చేస్తే సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఫార్ములా ఈ రేస్ స్కామ్ గురించి నోరు విప్పారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీ వచ్చారన్నారు. గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు ఉంటాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో సృజన్‌రెడ్డికి వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారన్నారు. సృజన్‌రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు స్వయానా అల్లుడు.
అమృత్ టెండర్లలో అవినీతి జరగలేదని స్వయంగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కందుల ఉపేందర్‌రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు సీఎం. తాను రెడ్డి కమ్యూనిటీకి చెందిన వ్యక్తినని, రాష్ట్రంలో ప్రతి రెడ్డితో ఏదో ఒక చుట్టరికం ఉంటుందన్నారు. అంతమాత్రాన ప్రతి విషయానికి దీనికి లింకు పెడితే ఎలా? అన్నారు.
అవినీతి పార్టీ అయిన బీజేపీని అంతం చేస్తామన్న కేటీఆర్, ఆ పార్టీ నేతలను ఇప్పుడెలా కలుస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రి. మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని చెప్పడం బీజేపీకి సహకరించడం కాదా? బీజేపీ- కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ఉంటుందని చెప్పినవాళ్ళు ఇప్పుడు పరోక్షంగా ఎవరికి సహకరిస్తున్నారని అన్నారు.
బీజేపీ-బీఆర్ఎస్ చీకటి ఒప్పందానికి ఇదొక నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతుంటే దానిపై చర్చ కూడదన్న ఉద్దేశంతో కేటీఆర్ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని, లోకసభ ఎన్నికల్లో డిపాజిట్లు దక్కలేదన్నారు. మూడోసారి నేతలు మెదళ్లు కోల్పోయారని, వారిని చూసి జాలిపడడం తప్ప వాళ్ల గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
లగచర్ల ఘటనపై సీఎం రేవంత్ స్పందన
దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా.. దీని వెనుక ఎంతవారు ఉన్నా ఊచలు లెక్క పెట్టాల్సిందే
ఇలాంటి దాడులు బీఆర్ఎస్ నాయకులపై జరిగితే కేటీఆర్ సమర్థిస్తారా?
దాడి చేసిన వారిని ఎలా పరామర్శిస్తారు? అంటే దాడులను ప్రోత్సహించేందుకే పరామర్శలా?
కేటీఆర్… pic.twitter.com/8Peb1Q41wZ
— BIG TV Breaking News (@bigtvtelugu) November 12, 2024