E-Paper
Advertisement

Chiranjeevi: గద్దర్ అవార్డ్స్.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన చిరు

Chiranjeevi: గద్దర్ అవార్డ్స్.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన చిరు
Advertisement

Chiranjeevi: ఇండస్ట్రీలో ఉన్నకొద్దీ అవార్డుల వేడుకలు తగ్గిపోతున్నాయి. నటీనటుల ప్రతిభను గుర్తించి వారి జీవితాలలో మర్చిపోలేని అనుభూతులను అందించేవే అవార్డులు. ఒకప్పుడు నంది అవార్డ్స్ అంటే ఎంతో గొప్పగా చెప్పుకొనేవారు. కానీ, ఇప్పుడు నంది అవార్డులను ఇవ్వడం ప్రభుత్వం ఆపేసింది. ఇక దీని గురించి కొన్నేళ్లుగా వివాదాలు సాగుతూనే ఉన్నాయి.

ఇకపోతే చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చినప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి.. నంది అవార్డ్స్ లానే తాము గద్దర్ అవార్డ్స్ ను ఇస్తామని చెప్పామని, ఇప్పటివరకు టాలీవుడ్ ప్రముఖల నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ఇక ఈరోజు కూడా సమ్మె రేవంత్ రెడ్డి ఈ విషయాన్నీ ఒక కార్యక్రమంలో ప్రస్తావించారు.

Advertisement

గద్దర్ జయంతి సందర్భంగా డిసెంబర్ 9న తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడా టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. నంది అవార్డులంత గొప్పగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డుల కార్యక్రమం చేపడతామని చెప్పామని కూడా అన్నారు. ఇక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎట్టకేలకు చిరంజీవేయి స్పందించారు.

రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే గద్దర్ అవార్డ్స్ గురించి ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడతామని తెలుపుతూ చిరు  ట్వీట్ చేశారు. ” తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని, సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ సినీపరిశ్రమలోని ప్రతిభావంతులకు, ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతియేటా ‘గద్దర్ అవార్డ్స్’ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన తరువాత, తెలుగు పరిశ్రమ తరపున, ఫిలిం ఛాంబర్ మరియు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను” అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×