Big Stories

Guwahati Airport roof collapses: వర్షం బీభత్సం.. కూలిన ఎయిర్‌పోర్టు సీలింగ్

Guwahati Airport roof collapses partially due to heavy rain

- Advertisement -

Guwahati Airport roof collapses: అస్సాంను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈదురు గాలులకు తోడు భారీ వర్షం కూడా తోడైంది. ఈ క్రమంలో గౌహతిలోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు వెలుపల ఉన్న సీలింగ్‌లోని ఓ భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఎవరు గాయపడలేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

- Advertisement -

సీలింగ్‌లో కొంత భాగం కూలిపోయింది. దీంతో విమానాశ్రయం అధికారులు కొద్దిసేపు కార్యకలాపాలను నిలిపివేశారు. సీలింగ్ కూలిన సమయంలో ప్రయాణికులు అక్కడే ఉన్నారు. భారీ శబ్దం రావడంతో భయంతో పరుగులు తీశారు. ఎయిర్ పోర్టులోకి వచ్చిన నీటిని తొలగించే పనిలోపడ్డారు సిబ్బంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

గౌహతి ఎయిర్‌పోర్టు అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే చర్చ. ఈ వర్షానికి ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న పెద్ద చెట్టు ఒకటి కుప్పకూలింది. అది చాలా పురాతన చెట్టు. దీని ధాటికి తట్టుకోలేక సీలింగ్ విరిగిపోయిందన్నది అధికారుల మాట. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతున్నారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News