BigTV English

45th Wedding anniversary: భార్య సురేఖతో వెకేషన్ లో చిరంజీవి.. భార్యపై ప్రేమను కురిపిస్తూ పోస్ట్..!

45th Wedding anniversary: భార్య సురేఖతో వెకేషన్ లో చిరంజీవి.. భార్యపై ప్రేమను కురిపిస్తూ పోస్ట్..!

45th Wedding anniversary:మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గురించి పరిచాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఆయన సినిమా పరంగా ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నారో.. వ్యక్తిగతంగా అంతే అభివృద్ధి చవి చూశారు. ముఖ్యంగా తన కెరియర్ ఈ స్థాయిలో ఉండడానికి కారణం తన భార్య సురేఖ (Surekha ) అని ఎప్పుడు చెబుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆదర్శ దంపతులుగా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి – సురేఖ వివాహం బంధానికి 45 ఏళ్లు పూర్తయ్యాయి. ఇక ఈరోజు ఈ మెగా దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని అతి కొద్ది మంది దగ్గర బంధుమిత్రులు , స్నేహితుల మధ్య ఫ్లైట్ లో వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోవడం కాస్త ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా కింగ్ నాగార్జున (Nagarjuna) ,ఆయన సతీమణి అమల (Amala) , సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu) భార్య నమ్రత (Namrata)తో పాటు మరికొంతమంది ఈ దంపతులతో కలిసి వారి వివాహ వార్షికోత్సవానికి కొత్త వెలుగులు తీసుకొచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


ఇకపోతే ఈరోజు తమ పెళ్ళి రోజు కావడంతో చిరంజీవి తన భార్యపై ప్రేమను కురిపిస్తూ ఒక పోస్ట్ పంచుకున్నారు.” నా సోల్మెట్ నా భార్య సురేఖ.. నాకు భార్యగా లభించడం నిజంగా నా అదృష్టం.నా సంతోషాలలోనే కాదు నా కష్టసుఖాలలో కూడా నాకు తోడుగా నిలిచి , అన్నివేళలా నన్ను ముందుండి నడిపించింది. ఇక మా పెళ్లి రోజు సందర్భంగా నా భార్యకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎప్పటికీ మా బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మాకు వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేసిన బంధువులు, స్నేహితులు, మా మంచి కోరుకునే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అంటూ ఒక పోస్టు విడుదల చేశారు. ఇకపోతే ఈరోజు చిరంజీవి తన వివాహ వార్షికోత్సవంలో భాగంగా తన భార్యతో కలిసి దుబాయ్ వెళ్లినట్టు సమాచారం.

వైరల్ గా మారిన చిరంజీవి సురేఖ పెళ్లినాటి గుర్తులు..


చిరంజీవి ఎప్పుడూ కూడా తమ పెళ్లి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే గతంలో నాడు జరిగిన విషయాలను ఆయన గుర్తు చేసుకోవడం జరిగింది. ” ‘మన ఊరి పాండవులు’ సినిమా సమయంలో అల్లు రామలింగయ్యను మొదటిసారి నేను కలిశాను. నాతో పాటు ఆ సినిమాలో ఎంతోమంది చేశారు. కానీ నా మీదే ఆయన దృష్టి ఉందనే విషయం అప్పుడు నాకు తెలియదు. ఆ తర్వాత రోజుల్లోనే తెలిసింది. అప్పుడు ఆయన నన్ను ఎందుకు చూస్తున్నారనే విషయం మురళీమోహన్(Murali Mohan) చెబితే తప్ప అర్థం కాలేదు. నటుడిని కదా అందుకే అబ్జర్వ్ చేస్తున్నారేమో అనుకున్నాను. కానీ ఆయన మనసులో ఇంకో కోణం ఉంది. అది దృష్టిలో పెట్టుకొని చూస్తున్నాడని నేను గమనించలేకపోయాను. ఇక అల్లు అరవింద్, నిర్మాత జయకృష్ణ , అల్లు రామలింగయ్య వీరంతా నన్ను ఎలా నొక్కేద్దామని ఆలోచించారు. జయ కృష్ణ వచ్చి నా దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న తర్వాతే పెళ్లి అని చెప్పాను. కానీ నెమ్మదిగా నన్ను అల్లు రామలింగయ్య కూతురు సురేఖ ను ఇచ్చి నాకు పెళ్లి చేశారు.” అంటూ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. మొత్తానికైతే నాడు వారు చిరంజీవికి సరైన జోడి అని సురేఖనిచ్చి వివాహం జరిపించడం వల్లే నేడు చిరంజీవి భవిష్యత్తు ఉన్నతంగా మారిందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×