CDAC Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ, పీహెచ్‌డీ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం. సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్(C-DAC)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే దరఖాస్తు చేసుకోండి.
చెన్నైలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC).. కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 20వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి కొన్ని గంటల్లో నోటిఫికేషన్ పూర్తి వివారాలను చూసేద్దాం.
NOTE: మరి కొన్ని గంటల్లో అప్లికేషన్ క్లోజ్ అవ్వనుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 101
ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
ప్రాజెక్ట్ అసోసియేట్ (ఫ్రెషర్), ప్రాజెక్ట్ ఇంజినీర్/ పీఎస్ అండ్ ఓ ఎగ్జిక్యూటివ్ (ఎక్స్ పీరియన్స్ డ్), ప్రాజెక్ట్ టెక్నీషియన్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్/ మాడ్యుల్/ ప్రాజెక్ట్ లీడర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
ఖాళీల వారీగా ఉద్యోగ వివరాలు:
ప్రాజెక్ట్ అసోసియేట్ (ఫ్రెషర్): 31
ప్రాజెక్ట్ ఇంజినీర్/ పీఎస్ & ఓ ఎగ్జిక్యూటివ్ (ఎక్స్‌పీరియన్స్‌డ్): 30
ప్రాజెక్ట్ టెక్నీషియన్: 30
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్/ మాడ్యుల్ లీడ్/ ప్రాజెక్ట్ లీడర్: 10
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 20లోగా దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హత: సబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ, పీహెచ్ డీ పాసై ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల అధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
ఉద్యోగులు జాబ్ చేయాల్సిన ప్లేస్: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు చెన్నై, ఢిల్లీ, ముంబై, కొచ్చి, గోవా, లక్షద్వీప్, పోర్ట్ బ్లెయిర్, వైజాగ్, భోపాల్, కార్వార్ లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.
ఉద్యోగ దరఖాస్తు ప్రక్రియ: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించాల్సి ఉంటుంది.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.cdac.in/
బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ, పీహెచ్ డీ అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ టెక్నీషియల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్థుల అందిరికీ ఇది మంచి అవకాశం. వెంటనే ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకోండి. ఉద్యోగం సాధించండి ఆల్ ది బెస్ట్.
ALSO READ: BECIL Recruitment: టెన్త్, ఇంటర్ అర్హతతో 407 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.79,000..
ముఖ్యమైనవి:
చెన్నై సీ-డ్యాక్ కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
అర్హత: బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
చివరి తేది: ఫిబ్రవరి 20వ తేదీలో గా ఆన్‌లైన్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి. మరి కొన్ని గంట్లో అప్లికేషన్ క్లోజ్ అవ్వనుంది.