Rakt Brahmand: ఈరోజుల్లో చాలావరకు సినీ సెలబ్రిటీలు సినిమాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో.. వెబ్ సిరీస్‌లలో నటించడానికి కూడా అంతే ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లలో నటించడం వల్ల ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అవ్వొచ్చు అనే ఫీలింగ్‌లోకి సినీ సెలబ్రిటీలు వచ్చేశారు. అలాంటి వారిలో సమంత కూడా ఒకరు. సీనియర్ హీరోయిన్ సమంత గత కొన్నాళ్లుగా వెండితెరపై అంత యాక్టివ్‌గా లేదు. అదే సమయంలో వెబ్ సిరీస్‌లపైకి తన ఫోకస్ షిఫ్ట్ అయ్యింది. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్’ (Rakt Brahmand) అనే వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంది సామ్. కానీ అనుకోకుండా ఈ సిరీస్ ఆగిపోయింది అనే వార్తలు వస్తుండడంతో దీనిపై నిర్మాతలు రాజ్, డీకే క్లారిటీ ఇచ్చారు.
నిజం ఏంటంటే.?
‘ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్ హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌ల తర్వాత సమంతకు బాలీవుడ్‌లోని ఓటీటీ వరల్డ్‌లో మంచి స్థానం దక్కింది. హిందీలో నేరుగా సినిమాలు చేయకపోయినా ఈ వెబ్ సిరీస్‌ల వల్లే తనకు బీ టౌన్‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అందుకే ఇలాంటి యాక్షన్ వెబ్ సిరీస్‌లతోనే ప్రేక్షకులను మరింత ఇంప్రెస్ చేయాలని ఫిక్స్ అయ్యింది. అలా తన కెరీర్‌లో గుర్తుండిపోయే డ్రీమ్ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టింది. అదే తన అప్‌కమింగ్ వెబ్ సిరీస్ ‘రక్త్ బ్రహ్మాండ్’. ఈ సిరీస్‌ను ‘తుంబాడ్’ ఫేమ్ రాహి అనిల్ బార్వే డైరెక్ట్ చేస్తుండగా.. సమంత క్లోజ్ ఫ్రెండ్స్ అయిన రాజ్, డీకే నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ ఆగిపోయింది అనే వార్తలపై వారు స్పందించారు.
కష్టపడుతూనే ఉంటాం
నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్‌గా తెరకెక్కుతున్న ‘రక్త్ బ్రహ్మాండ్’లో సమంతతో పాటు ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్, వామికా గబ్బి కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే పలు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ వెబ్ సిరీస్ ఆగిపోయిందని బాలీవుడ్‌లో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఏమయ్యిందో రాజ్, డీకే క్లారిటీ ఇచ్చారు. ‘సాఫీగా సాగే జీవితాన్ని కుదిపేయడానికి అప్పుడప్పుడు పలు సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో నీ చేతుల్లోనే ఉంటుంది. మేము ఎలా రియాక్ట్ అవ్వాలి అనే విషయంలో ఎప్పుడూ స్పష్టంగానే ఉంటాం. తల దించుకొని మా పని మేము చేసుకుంటూ పోతాం. చాలా కష్టపడతాం’ అంటూ ఇన్‌డైరెక్ట్‌గా ఈ రూమర్స్‌పై రియాక్ట్ అయ్యారు రాజ్, డీకే.
Also Read: గతం ఎప్పటికీ మారదు.. ‘దశ్యం 3’పై మోహన్‌లాల్ అదిరిపోయే అప్డేట్..
ఏమైనా పట్టించుకోము
‘ఒక్కసారి ఆగి అసలు మనం ఎక్కడ ఉన్నామో చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. మేము మా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు మధ్యలో ఉన్నాం, ఫ్యామిలీ మ్యాన్ 3 చివర్లో ఉన్నాం, వాటితో పాటు మరికొన్ని సినిమాలు, షోలు కూడా డెవలప్‌మెంట్‌లో ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే మేము ఎక్కడ ఉండాలి అనుకున్నామో అక్కడే ఉన్నాం. ఒకటి తర్వాత ఒకటి కథలు క్రియేట్ చేసుకుంటూ, నచ్చిన వారితో పనిచేసుకుంటూ, ఏడాది మొత్తం 24 గంటలు పనిచేసుకుంటూ సంతోషంగా ఉన్నాం. అయినా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. దానిని భరించడమే దానికి బెస్ట్ రియాక్షన్. కచ్చితంగా మీ ముందుకు మరికొన్ని కొత్త కథలతో వస్తాం. ప్రామిస్’ అంటూ ట్వీట్ చేశారు రాజ్, డీకే.
Every now and then something happens to shake things up. And you have a choice on how to react. For us that choice of reaction has always been clear—to just put our heads down and continue doing what we have been doing. Work harder. Do better. (1) pic.twitter.com/A6JHpL3Gvc
— Raj & DK (@rajndk) February 19, 2025