Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. స్వయంకృషితో పైకొచ్చిన స్టార్ హీరో మెగాస్టార్. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ అతి తక్కువ కాలంలోనే హీరో నుంచి మెగాస్టార్ అయ్యారు. ప్రస్తుతం కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తూ వరుస సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఇటీవల ఆయన సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరవుతూ తన సినిమాల గురించి మాత్రమే కాదు తన ఫ్యామిలీ గురించి కూడా ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటూ వస్తున్నారు.. తాజాగా రామ్ చరణ్ గురించి ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు. రామ్ చరణ్ విషయంలో ఎప్పుడూ చిరంజీవికి ఒక టెన్షన్ ఉందని ఓ ఈవెంట్లో బయటపెట్టారు. ఆ ఈవెంట్ వీడియో వైరల్ అవ్వడంతో మెగా ఫాన్స్ రామ్ చరణ్ విషయంలో చిరంజీవికి ఏం టెన్షన్? అని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా చిరంజీవి టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఆయన కుమారుడు గౌతమ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మానందం. ఈ మూవీని స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అభిరుచి గల నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన చిత్రం బ్రహ్మఆనందం. ఈ సినిమాకు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు.. ఇందులో బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రఘు బాబు, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, దివిజా ప్రభాకర్, ఈటీవీ ప్రభాకర్, దయానంద్ రెడ్డి వంటి నటీనటులు నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు..
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ బ్రహ్మానందం గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. బ్రహ్మానందం జీవితంలో పైకి ఎదగాలని ఎంత కష్టపడ్డాడో చిరంజీవి వివరించారు. అనంతరం తన పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగితే నేను మిగిలిన బాధ్యతల్ని నెరవర్తిస్తానని అందుకే నేను ఇంకెప్పటికీ పాలిటిక్స్ లోకి రాను అని తేల్చిచెప్పేసారు.. ఈ సందర్భంలో రాంచరణ్ గురించి కూడా చిరంజీవి కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. నా ఇల్లు ప్రస్తుతం లేడీస్ హాస్టల్ లాగా ఆడపిల్లలతో నిండిపోయింది అని చిరంజీవి సరదాగా మాట్లాడాడు. ఇప్పటికే కూతుర్లు మనవరాలు తో ఇల్లంతా ఆడపిల్లల గృహం లాగా మారింది ఇక రాంచరణ్ అనే నేను మగ పిల్లనివ్వమని కోరాను. కానీ రామ్ చరణ్ కూడా మళ్ళీ ఆడపిల్లని కన్నాడు.. ఇక ఇప్పుడు మరోసారి ఒక అబ్బాయిని కనాలని చెప్పాను. మళ్లీ అమ్మాయిని కంటాడేమో అని నాకు టెన్షన్ గా ఉంది అంటూ చిరంజీవి అనడంతో అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మెగా ఫాన్స్ చిరంజీవి కోరిక త్వరలోనే నెరవేరాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికైతే చిరంజీవికి అబ్బాయి కావాలని కోరిక బయటపడింది. మరి రామ్ చరణ్ తండ్రి కోరికను నెరవేరుస్తాడో లేదో చూడాలి. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే రీసెంట్గా గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్ తో మరో సినిమాను లైన్లో పెట్టుకున్నాడు. ఇక చిరంజీవి విశ్వంభర మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..