OTT Movie : బెంగాల్ చిత్ర పరిశ్రమ చిన్నదే అయినప్పటికీ, ఈ ఇండస్ట్రీ నుంచి కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయిన ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించింది. ఈ మూవీలో విష్ణుమూర్తి దశావతారంలోని అన్ని అవతారాలను చూపిస్తూ, ఒక సైకో కిల్లర్ హత్యలు చేస్తుంటాడు. డిఫరెంట్ కథతో వచ్చిన ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
రెండు ఓటిటిలలో
ఈ బెంగాలీ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘దావ్‌షోమ్ అవబోతార్… ఫర్ గాడ్స్ సాకే’ (Dawshom Awbotaar…For God’s Sake). ఈమూవీకి శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, శ్రీ వెంకటేష్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ నిర్మించారు. ఇందులో జిషు సేన్‌గుప్తా టైటిల్ పాత్రలో నటించగా, ప్రోసెన్‌జిత్ ఛటర్జీ, అనిర్బన్ భట్టాచార్య, జయ అహ్సన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ దుర్గాపూజ సందర్భంగా 19 అక్టోబర్ 2023న విడుదలైంది. ఇది బాక్సాఫీస్ విజయాన్ని సాధించడంతో పాటు, ఇందులో పాటలకు ప్రశంసలు వచ్చాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ (Hoichoi), (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకుంటాడు. అదే ఊరిలో ఒక మర్డర్ కేసును హీరోకి అప్పచెప్తారు. ఈ కేసును హీరో ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు. మర్డర్ చేసిన సైకో అక్కడ ఒక చేపను వదిలి వెళ్తాడు. ఆ తర్వాత మరొక హత్య జరుగుతుంది. ఆ ప్రాంతంలో ఒక తాబేలును వదులుతాడు. ఈ హత్యలు చేస్తుంది ఒక సైకో కిల్లర్ గా గుర్తిస్తాడు హీరో. ఇతనికి బోధర్ అనే పోలీస్ ఆఫీసర్ కూడా తోడు అవుతాడు. బోధర్ పోలీస్ ఆఫీసర్ గా ఉంటూనే, అనాధ పిల్లలకి చదువు చెబుతూ ఉంటాడు. ఇలా వీళ్ళిద్దరూ కలిసి ఆ సైకో కిల్లర్ ను పట్టుకోవాలని ప్రయత్నిస్తారు. గాయత్రి అనే డాక్టర్ హీరో దగ్గరికి వచ్చి, సైకో కిల్లర్ గురించిన విషయాలు తనకు తెలుసని చెప్తుంది. చంపుతున్న వ్యక్తి తనకు తానుగా దేవుడిగా ఊహించుకుంటూ, తప్పు చేసేవాళ్లను మాత్రమే చంపుతున్నాడని చెప్తుంది. అందులో భాగంగానే చేప, తాబేలును అక్కడ వదిలి పెట్టాడని హీరో తెలుసుకుంటాడు. విష్ణుమూర్తి దశావతారం కాబట్టి, ఈ రెండు హత్యల తర్వాత మిగతా ఎనిమిది హత్యలు చేస్తాడని తెలుసుకుంటారు. వాళ్లను ఎలాగైనా కాపాడాలని ముందుకెళ్తారు. ఈ క్రమంలో మూడో హత్య కూడా జరిగిపోతుంది. చివరికి హీరో ఆ సైకోని పట్టుకుంటాడా? ఎందుకు సైకో అలా చంపుతున్నాడు? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ (Hoichoi), (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘దావ్‌షోమ్ అవబోతార్… ఫర్ గాడ్స్ సాకే’ (Dawshom Awbotaar…For God’s Sake) అనే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే.