E-Paper
Advertisement

Megastar movie updates : సోషియో ఫాంటసీ చిత్రంతో మెగాస్టార్.. డైరెక్టర్ ఎవరంటే?

Megastar movie updates : సోషియో ఫాంటసీ చిత్రంతో మెగాస్టార్.. డైరెక్టర్ ఎవరంటే?
Advertisement
megastar  movie updates

Megastar movie updates : ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’గా అలరించబోతున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 11న రిలీజ్ కానుంది. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా.. చిరంజీవి నెక్ట్స్ మూవీ ఏంటనే దానిపై అధికారిక ప్రకటన లేదు. రెండు, మూడు ప్రాజెక్ట్స్ పేర్లు బలంగా వినిపించినప్పటికీ ఏదీ వర్కవుట్ కాలేదు. ఇటీవల చిరంజీవితో ఆయన కుమార్తె సుష్మిత కొణిదెల ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు బలంగా వినిపించాయి. ఇప్పుడు ఈ మెగాస్టార్‌తో యువీ క్రియేషన్స్ బ్యానర్ చేయటానికి ప్లాన్ చేసుకుంటోంది.

వివరాల్లోకి వెళితే.. గత ఏడాది బింబిసార చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన దర్శకుడు వశిష్టతో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయటానికి యువీ క్రియేషన్స్ సన్నాహాలు ప్రారంభించిందట. ఇటీవల చిరంజీవికి ఫాంటసీ కథను చెప్పారట. ఆయనకు బాగా నచ్చేసింది. మెగాస్టార్ ఫాంటసీ సినిమా చేసి చాలా ఏళ్లు అవుతుంది. పూర్తి స్క్రిప్ట్ తయారు చేయమని చెప్పారట. ఇప్పుడు వశిష్ట ఆ పనిలో బిజీగా ఉన్నారు. మరో వైపు ఈ యంగ్ డైరెక్టర్ తన నెక్ట్స్ మూవీని నందమూరి కళ్యాణ్ రామ్‌తో బింబిసార 2 చేస్తారా లేక సమయం తీసుకుని చిరంజీవితో మూవీ చేస్తాడా అని తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Advertisement

చిరంజీవి ఇప్పుడు వెరైటీ కథలను సెలక్ట్ చేసుకుని సినిమా చేయాలనే ఆలోచనతో ముందుకెళుతున్నారు. అందుకనే వెంట వెంటనే ప్రాజెక్ట్స్‌ని ఓకే చేయటం లేదు. తమిళ చిత్రం వేదాళంకు రీమేక్‌గా భోళా శంకర్ సినిమా తెరకెక్కుతోంది. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర్ సారథ్యంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా మెహర్ రమేష్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది.. చిరంజీవి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×