BigTV English

Hearing Issue:- మానసిక సమస్యకు దారితీస్తున్న వినికిడి లోపం..

Hearing Issue:- మానసిక సమస్యకు దారితీస్తున్న వినికిడి లోపం..

Hearing Issue:- వయసు పైబడుతున్న వారిలో ఆరోగ్య సమస్యలు ఎక్కువవ్వడం చాలా సహజం. అందులోనూ కంటిచూపు సమస్యలు, వినికిడి లోపం లాంటివి కామన్‌గా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటిని ప్రత్యేకంగా చికిత్స తీసుకోవడానికి కొంతమందికి ముందుకొచ్చినా.. చాలామంది మాత్రం ఇవి వయసు పెరగడం వల్ల వస్తున్న సమస్యలు అని కొట్టిపారేస్తారు. అలాంటి వారిలో ఒక సమస్య మరొక సమస్యకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.


వృద్ధులలో వినికిడి లోపం ఎక్కువగా ఉంటుంది. అందులో కొందరు ఎయిడ్‌ను ఉపయోగిస్తే.. చాలామంది ఉపయోగించడానికి ఇష్టపడరు. అయితే హియరింగ్ ఎయిడ్ ఉపయోగించని వారిలో వినికిడి సమస్య అనేది ఇతర మానసిక సమస్యలకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. డిమెన్షియా అనేది ఒక మానసిక సమస్య. ఇది కూడా ఎక్కువగా వృద్ధులలోనే కనిపిస్తూ ఉంటుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే వినికిడి లోపం అనేది డిమెన్షియాకు దారితీస్తుంది.

వినికిడి సమస్య ఉన్న వద్ధులలో హియరింగ్ ఎయిడ్‌ను ఉపయోగిస్తున్న వారిలో డిమెన్షియా సమస్య తక్కువగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. హియరింగ్ ఎయిడ్‌ ఉపయోగిస్తున్న వారిలో డిమెన్షియా అనేది అసలు కనిపించదని కూడా వారు అంటున్నారు. ఈ రెండు వృద్ధులలో కనిపించే కామన్ సమస్యలే అయినా ఈ రెండిటికి సంబంధం ఉంది అనే విషయం మాత్రం తాజాగా బయటికొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా డిమెన్షియాతో బాధపడుతున్న వృద్ధులలో 8 శాతం మందికి వినికిడి సమస్య ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.


ముందుగా వినికిడి సమస్యకు చికిత్సను అందిస్తే.. అది పరోక్షంగా డిమెన్షియా తగ్గడానికి కూడా దారితీస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ ఈ విషయంలో శాస్త్రవేత్తలకు పూర్తిస్థాయిలో స్పష్టత లేదు. ఇప్పటివరకు వారు చేసిన పరిశోధనల్లో హియరింగ్ ఎయిడ్ అనేది వినికిడి సమస్య వల్ల డిమెన్షియా వచ్చే పరిస్థితిని అదుపుచేస్తుందని తెలుసుకున్నారు. ఈ పరిశోధనల కోసం వారు 56 పైబడిన 4,37,704 మందిని ఎంపిక చేశారు.

వారు ఎంపిక చేసిన వారిలో మూడోవంతు మందికి ఎలాంటి వినికిడి సమస్య లేదు. మిగిలిన వారిలో కొంతవరకు వినికిడి సమస్య కనిపించింది. వారిలో 11.7 శాతం మంది హియరింగ్ ఎయిడ్స్ ఉపయోగిస్తున్నట్టుగా గుర్తించారు. వినికిడి సమస్య కొంతవరకే ఉన్నా కూడా హియరింగ్ ఎయిడ్స్ ఉపయోగించని వారిలో డిమెన్షియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు వారు గమనించారు. అందుకే డిమెన్షియాకు దూరంగా ఉండాలంటే హియరింగ్ ఎయిడ్స్‌ను ఉపయోగించాలని వృద్ధులకు సలహా ఇస్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×