BigTV English

Mehreen Pirzada Freezing Eggs: పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన మెహ్రీన్.. వీడియో వైరల్..!

Mehreen Pirzada Freezing Eggs: పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన మెహ్రీన్.. వీడియో వైరల్..!

Mehreen Pirzada Freezing Egg: పురుషుడి స్పర్శ లేకుండా ప్రెగ్నెంట్ కాలేరు అన్నది పాత కథ. ఇప్పుడు ఒక మహిళ తల్లి కావాలంటే పురుషుడుతో పని లేదు. డాక్టర్ దగ్గరకు వెళ్లి IVF ద్వారా తల్లి కావచ్చు. ఎంతోమంది సెలబ్రిటీలు ప్రస్తుతం ఇదే విధానంతో పెళ్లి అయినా, అవ్వకపోయినా తల్లి మాత్రం అవుతున్నారు. తాజాగా మరో హీరోయిన్ IVF ద్వారా తల్లిని కాబోతున్నట్లు ప్రకటించింది. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా. న్యాచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమ గాధ అనే సినిమాతో మెహ్రీన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.


ముద్దుగా బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మను చూసి తెలుగు కుర్రాళ్ళు మనసు పారేసుకున్నారు. మొదటి సినిమాతోనే హిట్ అందుకోవడంతో అమ్మడికి తిరుగులేదు అనుకున్నారు. కానీ, అవకాశాలు వచ్చాయి కానీ విజయాలు మాత్రం దక్కలేదు. ఇక చాలాకాలం తరువాత ఎఫ్ 2 లో హనీ పాత్రలో మెరిసి మెహ్రీన్ మరోసారి హాట్ అందుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే మెహ్రీన్ హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ మనవడు, ప్రస్తుత అడంపూర్ ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్తో నిశ్చితార్థం చేసుకుంది. మరికొన్నిరోజుల్లో పెళ్లి అనుకునేలోపు తమ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అని తెలిపి షాక్ ఇచ్చింది. ఇక ఆ తరువాత సింగిల్ గానే తన కెరీర్ ను నెట్టుకుంటూ వస్తున్న మెహ్రీన్ తాజాగా IVF ద్వారా తాను తల్లిని కాబోతున్నట్లు ఒక వీడియో ద్వారా తెలిపింది.

Also Read: Say no to Child Labour : శ్రమ విడిచిపెట్టాలి.. పుస్తకం పట్టాలి : 22 ఏళ్ల క్రితం వీడియో షేర్ చేసిన చిరంజీవి


“రెండేళ్లుగా ఈ ప్రక్రియ కోసం, నా మనసును, మైండ్ ను ఒప్పించి.. చివరకు ఈ ప్రక్రియ చేసినందుకు సంతోషిస్తున్నాను. ఇలాంటి వ్యక్తిగత విషయాలు ఏదైనా పంచుకోవాలా వద్దా అని ఆలోచించినప్పుడు నాలాంటి చాలా మంది మహిళలు ఉన్నారని తెలుసుకున్నాను. వారు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో లేదా బిడ్డను కలిగి ఉండాలో వారు తేల్చుకోలేకపోతున్నారు. భవిష్యత్తు కోసం మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా ముఖ్యం అని నాకు అనిపించింది. దీని గురించి మాట్లాడడం నిషిద్ధం కాబట్టి ఎక్కువగా నేను మాట్లాడను. సాంకేతికత సహాయంతో, మన కోసం మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాము. ఇలాంటిది ఎందుకు చేయించుకోకూడదు. తల్లి కావాలనేది నా కల. నేను కొన్నేళ్లు లేట్ చేసినందుకు దీని బయటపడేయలేను. కొన్నిసార్లు నాకు చాలా బాధ అనిపిస్తుంది.

Also Read: Kalki 2898 AD: ఐపీఎల్ కోసం ‘కల్కి’ నుంచి భైరవ.. నెక్ట్స్ లెవెల్‌లో ప్రభాస్

ఇదొక సవాల్ లాంటింది. ముఖ్యంగా సూదులు, రక్తం మరియు ఆసుపత్రులంటే ఫోబియా ఉన్న నాలాంటి వారికి. నేను ఆసుపత్రికి వెళ్లిన ప్రతిసారీ మూర్ఛపోతాను. అన్ని హార్మోన్ల ఇంజెక్షన్ల కారణంగా మీరు ఎదుర్కొంటున్న స్థిరమైన భావోద్వేగ గందరగోళం అంత సులభం కాదు. ఇది ఇంత విలువైనదా అంటే.. అవును నరకంగా ఉన్నా కూడా అది విలువైనది. మీరు ఏ పనిని ఎంచుకున్నా, మీ కోసం చేయండి. నా గైనకాలజిస్ట్ డాక్టర్ రిమ్మీ నిరంతరం నా కోసం ఉన్నందుకు, మా అమ్మ ఎప్పుడూ నా పక్కనే ఉన్నందుకు ధన్యవాదాలు.. నా ఫ్రెండ్స్ అందరూ నాకు తోడు ఉన్నారు కాబట్టి నేను ఈ రంగుల లోకంలో ఎగురుతున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే మెహ్రీన్ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ విషయం తెలియడంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×