Meiyazhagan: కొన్ని సినిమాలు ఎప్పుడు ఎలాంటి విజయం సాధిస్తాయో ఎవరు ఊహించలేరు. అయితే ఎన్నో నమ్మకాలతో చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవుతూ ఉంటాయి. చాలా సందర్భాలలో ఈ సినిమా ఎందుకు పోయింది అని అనిపిస్తుంది కూడా అలాంటి సినిమాలు ప్రస్తావన వస్తే ఆరెంజ్, జోష్, ఖలేజా,అతడు వంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి. అలానే తెలుగులో తీసిన కొన్ని సినిమాలు తెలుగులో హిట్ కాకపోయినా మిగతా భాషలో హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక బాహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు ఎన్నో అంచనాల మధ్య వెళ్లిన ఫ్యాన్స్ డిసప్పాయింట్ ఏ సినిమా పోయింది అని మొదట టాక్ బయటకు వచ్చేసింది. అయితే ఈ టాక్ దర్శకు నిర్మాతల్లో కూడా భయాన్ని కలిగించింది. కానీ ఇదే సినిమాకు నార్త్ ఆడియన్స్ బ్రహ్మరథం పెట్టారు. అక్కడి ప్రేక్షకులకు ఈ సినిమా విపరీతంగా నచ్చింది. ఆ తర్వాత చాలామంది తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరించడం మొదలుపెట్టి మంచి కలెక్షన్స్ ఇచ్చారు.
ఇక రీసెంట్ గా తమిళ్ లో రిలీజ్ అయిన సినిమా “మెయిజగన్” ఈ సినిమాకి సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. సి ప్రేమ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు 96 లాంటి ఒక క్లాస్ లవ్ స్టోరీని తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కించాడు. అదే సినిమాని తెలుగులో జాను పేరుతో రీమేక్ కూడా చేశారు. కానీ తమిళ్ ఫీల్ మళ్లీ ఇక్కడ క్రియేట్ కాలేదు. అయితే జాను సినిమా రావడానికి అంటే ముందే చాలా మంది సినిమా ప్రేమికులు తమిళ్లో 96 సినిమాలు చూసేశారు. అక్కడినుంచి సి ప్రేమ్ కుమార్ వర్క్ ని కూడా ఫాలో అవ్వడం మొదలుపెట్టారు కొంతమంది ఆడియన్స్. ఇక సి ప్రేమ్ కుమార్ రెండువ సినిమా తెలుగులో సత్యం సుందరం పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలానే మంచి కలెక్షన్స్ కూడా వసూలు చేసింది. ఈ సినిమాకి తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు.
వాస్తవానికి ఈ సినిమా చాలా మందికి విపరీతంగా నచ్చింది హ్యూమన్ వాల్యూస్ ను అద్భుతంగా ఈ సినిమాలో ప్రజెంట్ చేశాడు సి ప్రేమ్ కుమార్. అయితే ఈ సినిమాకి మిగతా ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు వస్తున్నాయి. అలానే ఆ దర్శకుడిని మెచ్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఈ సినిమాకి ఊహించినంత ఆదరణ లభించలేదు. ఇది ఎందుకు జరుగుతుందో నాకే అర్థం కాలేదు అంటూ డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో డైరెక్టుగా చెప్పారు. ఇక తమిళ్ ప్రేక్షకులు విషయానికొస్తే చాలా తెలుగు సినిమాలను కూడా అక్కడి ప్రేక్షకులు ఆదరించరు. కానీ తెలుగు ప్రేక్షకులు బాషతో సంబంధం లేకుండా ఒక మంచి సినిమాను ఇప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. ఇలాంటి ఆడియన్స్ దొరకడం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం.