E-Paper
Advertisement

Mia Khalifa in Big Boss : బిగ్ బాస్ హిందీ ఒటీటీలో మాజీ పార్న్ స్టార్..

Mia Khalifa in Big Boss : బిగ్ బాస్ హిందీ ఒటీటీలో మాజీ పార్న్ స్టార్..
Advertisement
Mia Khalifa in Big Boss

Mia Khalifa in Big Boss : రియాలిటీ షోలు, టాక్ షోలు.. ఈమధ్య బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే సీజన్ తర్వాత సీజన్ రియాలిటీ షోలను నిర్వహిస్తూ వెళ్తున్నారు మేకర్స్. ముఖ్యంగా హిందీలో ఇలాంటి రియాలిటీ షోలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి షోలకు క్రేజ్ తీసుకొచ్చింది ‘బిగ్ బాస్’. ఇప్పటికీ ఈ రియాలిటీ షోను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కాబట్టే సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ అవుతోంది. తాజాగా బిగ్ బాస్ ఓటీటీలో ఒక పార్న్ స్టార్ చేరనుందని వార్తలు వైరల్ అయ్యాయి.

Advertisement

బిగ్ బాస్ అనేది ముందుగా ఒక రియాలిటీ షోగా.. కొందరు సెలబ్రిటీలు కొన్నిరోజుల పాటు ఒకే ఇంట్లో బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండాలి అనే కాన్సెప్ట్‌తో మొదలయ్యింది. ఈ కాన్సెప్ట్.. ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. అందుకే సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో సైతం ఈ షోను హోస్ట్ చేయడానికి ముందుకొచ్చాడు. టీవీలో బిగ్ బాస్ క్రేజ్‌ను చూసి ప్రత్యేకంగా ఓటీటీ సబ్‌స్క్రైబర్ల కోసం ఒక బిగ్ బాస్ షోను ప్లాన్ చేయాలి అని మేకర్స్ ప్లాన్ చేశారు. అందులో కూడా మొదటి సీజన్ సక్సెస్ అవ్వడంతో రెండో సీజన్ ప్రారంభమయ్యింది.

బిగ్ బాస్ ఓటీటీ అనేది హిందీలో మంచి గుర్తింపును సాధించింది. దీంతో ఇతర భాషల్లో కూడా ఇలాంటి షోను ప్లాన్ చేశారు. దీనికి లభించిన క్రేజ్ చూసి మేకర్స్.. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2ను ప్లాన్ చేశారు. ఇప్పటికే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 హిందీలో పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్ట్ బయటికొచ్చింది. ఇందులో ఒకప్పటి పార్న్ స్టార్ మియా ఖలీఫా పేరు కూడా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొన్ని రోజుల క్రితం మొదలైన ఈ రూమర్.. ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొనడం కోసం మేకర్స్ ఇప్పటికీ తనను అప్రోచ్ అయ్యారని రూమర్స్ చెప్తున్నాయి.

Advertisement

మియా ఖలీఫాను బిగ్ బాస్ ఓటీటీ కోసం అప్రోచ్ అయ్యారని వార్తలు వస్తున్నా దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఒకప్పుడు ఇలాగే బిగ్ బాస్‌లో మియా పాల్గొననుందని వార్తలు వచ్చినప్పుడు.. దానికి తను చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ‘నేను ఎట్టి పరిస్థితుల్లో ఇండియాలో అడుగుపెట్టను. నేను బిగ్ బాస్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నా అని ప్రచారం చేస్తున్న ప్రతీ ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని 2015లో మియా ఖలీఫా ట్వీట్ చేసింది. మరి బిగ్ బాస్‌పై ఇప్పటికైనా తన ఉద్దేశ్యం మారిందో లేదో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×