BigTV English

Thamanna Birthday Special : మిల్క్ బ్యూటీ తమన్నా బర్త్ డే స్పెషల్..

Thamanna Birthday Special : మిల్క్ బ్యూటీ తమన్నా బర్త్ డే స్పెషల్..

Thamanna Birthday Special : నవతరం భామల్లో తనదైన శైలిలో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి మిల్కీ బ్యూటీ . సౌత్ , నార్త్ ఇండియాలోనూ పాపులర్ నటిగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ తమన్నా భాటియా . మొదటి సినిమా తమన్నాకు సక్సెస్ ఇవ్వలేకపోయినా .. పట్టుదలతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఈ రోజు మిల్కీ బ్యూటీ తమన్నా పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆమె సినీ కెరీ​ర్ పై ఓ లుక్​ వేద్దాం.


తమన్నా భాటియాకు చిన్ననాటి నుంచి కళలపై ఆసక్తి ఉండేది . ఈమె నాట్యంలో కూడా శిక్షణ తీసుకుంది . తన 13 ఏట నుంచే సినీ రంగంలోకి అడుగుపెట్టింది . నటిగా , మోడల్ గా, నృత్యకారిణిగా మంచి పేరు తెచ్చుకుంది . 2005లో బాలీవుడ్​ లో చాంద్​ సా హోషన్ చెహ్రా సినిమాతో సినీ ప్రస్థానం మొదలుపెట్టింది తమన్నా. ఆ తరువాత మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన “శ్రీ ” మూవీతో తెలుగు చిత్ర సీమలోకి ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత “కేడి ” అనే సినిమాతో హాయ్ చెప్పింది .

ఇలా ఆరంభంలోనే తెలుగు , హిందీ , తమిళ భాషల్లో నటించిన తమన్నాకు సినిమా రంగం లో అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన “హ్యాపీ డేస్ ” సినిమా తమన్నాకు మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది . తమిళ్ మూవీ “కళ్ళూరి ” కూడా భారీ సక్సెస్ ఇచ్చింది . 2009 లో ధనుష్ సరసన “పడికతవాన్ ” సినిమా తన కెరియర్ లో బిగ్ హిట్ గా నిలిచింది .


తెలుగు లో “కొంచెం ఇష్టం కొంచెం కష్టం ” మూవీ తో తమన్నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది . ఈ సినిమాలో తమన్నా నటనకు ఫిల్మి ఫేర్ అవార్డు అందుకుంది . ఆవారా , 100% లవ్ ,బద్రినాథ్ , కెమెరామెన్ గంగతో రాంబాబు ,ఊసరవెళ్లి, రచ్చ , బాహుబలి చిత్రాలు సినిమాల్లో కథానాయికగా నటించి మరింత పాపులర్ అయ్యింది. మిల్క్ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న తమన్నా మరికొన్ని సినిమాల్లో ఐటమ్ గాళ్ గా చిందేసింది. మహేష్ బాబు మూవీ సరిలేరు నీకెవ్వరూ మూవీలో స్పెషల్ పాటలో అందరిని అలరించింది

కేజీఎఫ్ చాప్టర్ 1 యశ్ తో కలిసి తమన్నా వేసిన స్టెప్పులు థియేటర్లో షేక్ చేశాయి . ఎఫ్ 2 చిత్రంలో తమన్నా నటన అందరిని ఆకట్టుకుంది . ఆ తర్వాత మెగాస్టార్ మూవీ “సైరా ” చిత్రం లో తన నటన తో అందరి ప్రశంసలు అందుకుంది. ఆనందో బ్రహ్మ , పెట్రోమాక్స్ ,యాక్షన్ , బోళాశంకర్ , గని ,గుర్తుందా శీతాకాలం ఇలా చాలా సినిమాల్లో నటించింది . నటిగా కెరియర్ ఎంచుకున్న తమన్నా మొదట్లో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది. తన హార్డ్ వర్క్ తో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు ,హిందీ ,తమిళ్ , మలయాళం చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులకు వినోదం అందిస్తున్న తమన్నా భవిష్యత్తులో మరింత సక్సెస్ ఫుల్ గా తన కెరియర్ కొనసాగాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే తమన్నా భాటియా ..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×