E-Paper
Advertisement

Mirzapur Season 3 Teaser: ఓటీటీలకు అతుక్కుపోండి ఫ్రెండ్స్.. ‘మీర్జాపూర్ సీజన్ 3’ వచ్చేస్తోంది.. టీజర్ చూశారా..?

Mirzapur Season 3 Teaser: ఓటీటీలకు అతుక్కుపోండి ఫ్రెండ్స్.. ‘మీర్జాపూర్ సీజన్ 3’ వచ్చేస్తోంది.. టీజర్ చూశారా..?
Advertisement

Mirzapur Season 3 Streaming Date Fixed: ‘మీర్జాపూర్’.. ఈ సిరీస్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ పెను సంచలనం సృష్టించింది. అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయిన సిరీస్‌ల్లో మీర్జాపూర్ అనేది ఒక రికార్డ్. కరణ్ అన్షుమాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లు బాగా పాపులర్ అయ్యాయి. ఫస్ట్ పార్ట్‌కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో సెకండ్ పార్ట్‌ను తీసుకొచ్చారు. ఈ రెండు పార్టులు ఊహకందని రెస్పాన్స్‌తో సినీ ప్రేక్షకుల్ని, ఓటీటీ ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్‌ను రాబట్టాయి. మీర్జాపూర్ నిజంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.

ఈ సిరీస్ అధికారం, ప్రతీకారం, ఆశయం, రాజకీయాలు, ద్రోహం, మోసం, సంక్లిష్టమైన కుటుంబ డైనమిక్‌ల కథతో క్రైమ్ థ్రిల్లర్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, విక్రాంత్ మస్సే, వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించి అదరగొట్టేశారు. ఇక ఈ రెండు పార్టులు సూపర్ డూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఇప్పుడు మూడో పార్టు కోసం ఓటీటీ ఆడియన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

Advertisement

ఇప్పటికే ఈ మీర్జాపూర్ సీజన్ 3 సిరీస్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. దీంతో ఈ సీజన్ 3 ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్ 3కి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. తాజాగా మీర్జాపూర్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ వెల్లడించింది. ఇందులో బాగంగా ఈ సీజన్ 3 సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 240 దేశాల్లో జూలై 5, 2024 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ అప్డేట్‌ కొత్త సీజన్ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభిమానులకు ఆనందాన్ని అందించింది.

Also Read: OTTలో బ్లాక్ బస్టర్​​ సిరీస్​ సీక్వెల్స్​​.. స్ట్రీమింగ్‌కి రెడీ.. ఎందులో అంటే?

Advertisement

కాగా ఈ క్రైమ్-థ్రిల్లర్‌లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేతా త్రిపాఠి శర్మ, రసిక దుగల్, విజయ్ వర్మ, ఇషా తల్వార్, అంజుమ్ శర్మ, ప్రియాంషు పైన్యులి, హర్షిత శేఖర్ గౌర్, రాజేష్ తైలాంగ్, మన్ షీబా మా చద్దా, రిషి చద్దా వంటి స్టార్ తారాగణం కీలక పాత్ర పోషిస్తోంది. కాగా ఈ సీజన్ 3 కి గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ దర్శకత్వం వహించారు. రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్‌లు ఎక్సెల్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ల బ్యానర్‌లపై సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ సిరీస్ టీజర్‌ను అమెజాన్ ప్రైమ్ రిలీజ్ చేసింది. ఆ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×