Big Stories

Ajit Thanks Uncle Sharad Pawar: ఆసక్తికరంగా మహారాష్ట్ర రాజకీయాలు, బాబాయ్ శరద్‌కు.. కేబినెట్ బెర్త్ అయితే..!

Ajit Pawar with Sharad Pawar: మహారాష్ట్రలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కొద్ది నెల ల్లో మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అజిత్ వర్గం తమ మాతృపార్టీకి దగ్గరయ్యేందుకు పావులు కదుపుతోంది. ఇందులోభాగంగా 24 ఏళ్లగా పార్టీని సమర్థవంతంగా నడిపించిన శరద్ పవార్‌కు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కృతజ్ఞతలు చెప్పారు.

- Advertisement -

ఎన్సీపీ స్థాపించి 24 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబైలో అజిత్ వర్గం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో అజిత్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పనిలోపనిగా మోదీ కేబినెట్‌కు ఎందుకు దూరంగా ఉన్నామో చెప్పకనే చెప్పేశారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయ్యేందుకు ఎన్సీపీకి చాలా అవకాశాలు వచ్చాయన్నారు. కాకపోతే కేబినెట్ కంటే తక్కువ స్థాయి పదవిలో తాము కొనసాగలేమని బీజేపీకి చెప్పినట్టు తెలిపారు.

- Advertisement -

మా పార్టీ ఇప్పటికీ ఎన్డీయే భాగమేనన్నారు అజిత్ పవార్. మా కూటమి భవిష్యత్తులో 300 సీట్ల మార్క్ దాటడం ఖాయమన్నారు. మహారాష్ట్రలో 48 ఎంపీ సీట్లు ఉండగా పొత్తుల్లో భాగంగా అజిత్ వర్గం కేవలం ఐదు స్థానాల్లో పోటీ చేసింది. కేవలం ఒక్క సీటును మాత్రమే గెలుచుకుంది. ఈ క్రమంలో అజిత్ పవార్ బాబాయ్‌కు కృతజ్ఞతలు చెప్పడం మహా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.

Also Read: AmitShah serious on Tamilisai: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. తమిళిసై పై అమిత్ షా ఆగ్రహం..

ఎన్నికల్లో పార్టీకి తగిన దెబ్బపై స్పందించిన అజిత్, అంతర్గత సమస్యలపై దృష్టి సారిస్తామన్నారు డిప్యూటీ సీఎం. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నిశితంగా రాజకీయ పార్టీలు గమనిస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News