Big Stories

HMD Atlas: ఇది ఏదో బాగుందే.. HMD నుంచి బడ్జెట్ కిల్లర్.. ఆపడం కష్టమేనేమో!

Mid Range Budget Phone from HMD: స్మార్ట్‌ఫోన్ కంపెనీ నోకియా HMD పేరుతో కొత్తకొత్త ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొస్తూ సంచలనం సృష్టిస్తుంది. గ్యాప్ లేకుండా వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తుంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ప్రజలను అట్రాక్ట్ చేసేందుకు బడ్జెట్ ధరలో ఫోన్లను లాంచ్ చేస్తుంది. ఇటీవలే కంపెనీ Skyline అనే ఫోన్‌ విడుదల చేయగా.. తాజాగా తన బ్రాండ్ నుంచి HMD కొత్త స్మార్ట్‌ఫోన్ HMD Atlas విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

HMD తన లైనప్‌లో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఇటీవల US మార్కెట్ కోసం HMD పల్స్ ట్రియో, HMD వైబ్‌తో సహా అనేక ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. HMD Atlas విడుదల చేయనుంది. ఈ ఫోన్ FHD+ డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది.

- Advertisement -

HMD అట్లాస్ ధర $240 అంటే సుమారు రూ. 20,038గా ఉండొచ్చు. స్మార్ట్‌ఫోన్  ఆలివ్ గ్రీన్ కలర్‌లో రావచ్చు. HMD వైబ్ ధర 150 డాలర్లు. వైబ్ సక్సెసర్‌గా అట్లాస్‌ను కంపెనీ తీసుకొస్తుంది. HMD స్కైలైన్, ఇది లూమియా ఫోన్‌ల‌కు ఈ స్మార్ట్‌ఫోన్ అన్ని విధాల సమానంగా ఉంటుంది.

Also Read: ఆహా దొరికింది.. స్మార్ట్‌ఫోన్‌పై రూ.25 వేల డిస్కౌంట్.. ఇలాంటి ఆఫర్లు ఎలా ఇస్తారు!

HMD అట్లాస్ FHD+ రిజల్యూషన్‌తో 6.64-అంగుళాల IPS LCD డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌‌కు సపోర్ట్ ఇస్తుంది. డిస్‌ప్లేలో పంచ్ హోల్ కటౌట్‌లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్ 8GB RAM +128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. దీనిని మైక్రో SD స్లాట్ ద్వారా స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఈ ఫోన్ 5G కనెక్టివిటీ, Wi-Fi 5 (AC), బ్లూటూత్ 5.1 మరియు NFCకి సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను కూడా ఉంటుంది.

కెమెరా సెటప్ గురించి మాట్లాడితే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్, డెప్త్ సెన్సార్ ఉంటాయి. అల్ట్రా వైడ్ కెమెరా కూడా అట్లాస్‌ను ఇతర HMD మోడల్‌ల నుండి బెటర్‌గా చూపిస్తుంది. ఫోన్ 5,500mAh బ్యాటరీని క్విక్‌చార్జ్ 4.0+తో కలిగి ఉంటుంది. అయితే ఛార్జింగ్ స్పీడ్ వెల్లడించలేదు. QC4.0+ అనేది పాత QC3.0 టెక్నాలజీ.

Also Read: అంబానీ మావ తాటతీశాడు.. రూ.3వేలకే 5G ఫోన్.. ఫీచర్లు సూపరో సూపర్!

HMD Atlas స్మార్ట్‌ఫోన్ Nokia G400కి అప్‌గ్రేడ్ వెర్షన్. ఇందులో 6.58 అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లే ఉంటుంది. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ ప్రాసెసర్‌‌పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. 20W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News