BigTV English

Mita Vashisht: తెలుగు డైరెక్టర్ పై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు.. రెండు నెలలు గడపమని టార్చర్ చేశాడని..

Mita Vashisht: తెలుగు డైరెక్టర్ పై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు.. రెండు నెలలు గడపమని టార్చర్ చేశాడని..

Mita Vashisht: ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని కొందరు.. లేదని కొందరు చెప్పుకురావడం వింటూనే ఉన్నాం. కెరీర్ లో సక్సెస్ అయినవాళ్లు బయటకు చెప్తున్నారు.. సక్సెస్ కానివాళ్ళు అవకాశాలు రావేమో అన్న భయంతో బయటకి చెప్పడం లేదు. కానీ, నిత్యం ఎక్కడో ఒక చోట నటీమణులు క్యాస్టింగ్ కౌచ్ బారిన పడుతున్నారు అన్నది మాత్రం నమ్మదగ్గ నిజం.


తాజాగా బాలీవుడ్ నటి మితా వశిష్ట్.. ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కున్న క్యాస్టింగ్ కౌచ్ ఘటనను అభిమానులతో పంచుకుంది. మితా తెలుగువారికి పరిచయం లేదు. హిందీ సినిమాలు, సిరీస్ లు చూసేవారికి ఆమె సుపరిచితురాలు అని చెప్పొచ్చు. అయితే ఆమె కెరీర్ మొదట్లో ఒక తెలుగు సినిమా ఆఫర్ వచ్చిందట.

ఇక దాని గురించి ఆమె మాట్లాడుతూ.. ” నా కెరీర్ మొదట్లో ఒక తెలుగు డైరెక్టర్ నాకు కాల్ చేసి మంచి ఆఫర్ ఉంది చెన్నైలో కలవమని చెప్పాడు. నేను కూడా అతడిని కలిశాను. కథ కూడా నచ్చింది. కథలో హీరోయిన్ నేనే అన్నాడు. అయితే ఆ పాత్ర కోసం తనతో రెండు నెలలు గడపమని చెప్పాడు. మొదట నాకు అర్ధం కాలేదు. తెలుగు నేర్చుకోవడానికి రెండు నెలలు తనతో ఉండమన్నాడేమో అనుకున్నాను.


అదే విషయాన్నీ అతడిని అడిగితే .. కాదు, రెండు నెలలు నాతో నువ్వు సహజీవనం చేయాలి. అలా చేశాకే సినిమా మొదలవుతుంది అని చెప్పాడు. అతడి బుద్ది అర్ధమయిన వెంటనే ముఖం మీదనే నాకు ఆ సినిమా వద్దు, పాత్ర వద్దు అని నిర్మొహమాటంగా చెప్పి వచ్చేసాను. చాలాసేపు నన్ను అదిగి టార్చర్ పెట్టాడు.

అతడు పెద్ద డైరెక్టర్ కావొచ్చు. అతడి డైరెక్షన్ లో చేసిన హీరోయిన్స్ కు అవార్డులు రావొచ్చు. అయితే మాత్రం ఇలాంటివి అడిగినప్పుడు లొంగిపోవాలా..? నటన ఒక కళ. దానికోసం లొంగిపోవాల్సిన అవసరం లేదు. అవకాశాల పేరు చెప్పి హీరోయిన్స్ లొంగదీసుకునే సంస్కృతీ తెలుగులో నేను చూసాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అంతగా ఆమెను ఇబ్బంది పెట్టిన తెలుగు డైరెక్టర్ ఎవరా అని అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు.

Related News

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big Stories

×