BigTV English

MM Keeravani: కీరవాణి ఓ దరిద్రుడు.. హిందువులనే అవమానిస్తావా.? బ్యాన్ చేయాలంటూ డిమాండ్

MM Keeravani: కీరవాణి ఓ దరిద్రుడు.. హిందువులనే అవమానిస్తావా.? బ్యాన్ చేయాలంటూ డిమాండ్

MM Keeravani : ఒక బుల్లితెర షో, అందులో కనిపించే ఒక కంటెస్టెంట్ వల్ల మ్యూజిక్ ఇండస్ట్రీలో ఈ రేంజ్‌లో సంచలనం క్రియేట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ‘పాడుతా తీయగా’ అనే సింగింగ్ షో బుల్లితెరపై ఎంత పాపులర్ అని చాలామందికి తెలుసు. ఈ షో తర్వాతే మరెన్నో సింగింగ్ షోలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ముందుకొచ్చాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి లెజెండరీ సింగర్ ప్రారంభించిన ఈ షో.. ఇప్పటికి 24 సీజన్స్ పూర్తి చేసుకొని 25వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. అందులో కంటెస్టెంట్‌గా కనిపించిన ప్రవస్తి ఆరాధ్య అనే అమ్మాయి చేసిన ఆరోపణల వల్ల మ్యూజిక్ ఇండస్ట్రీ షేక్ అయిపోయింది.


వీడియో వైరల్

‘పాడుతా తీయగా’లో ఎమ్ఎమ్ కీరవాణి (MM Keeravani), సునీత లాంటి మ్యూజిక్ లెజెండ్స్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారిపై సింగర్ ప్రవస్తి తీవ్రమైన ఆరోపణలు చేసింది. తనను బాడీ షేమింగ్ చేస్తున్నారని, కొందరు కంటెస్టెంట్స్‌ను ప్రత్యేకంగా చూస్తున్నారని, కీరవాణి పాటలు పాడితేనే ఎక్కువ మార్కులు వేస్తారని.. ఇలా ప్రతీ ఒక్కరిపై పేరుపేరునా ఆరోపణలు చేసింది. దీంతో మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇన్ని కుట్రలు జరుగుతాయా అని నెటిజన్లు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కొందరు ప్రవస్తి చేసిన ఆరోపణలను నమ్ముతూ తనకు సపోర్ట్‌గా నిలబడితే.. మరికొందరు మాత్రం అంత లెజెండరీ సింగర్స్‌పై తను అనవసరంగా ఆరోపణలు చేస్తుందని మండిపడుతున్నారు. ఈ క్రమంలో కీరవాణి పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


క్రిస్టియన్ మతంలో మాత్రమే

ఎమ్ఎమ్ కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంత బిజీగా ఉన్నా.. పలు సింగింగ్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూనే ఉన్నారు. అందులో తన అనుభవాలన్నీ జూనియర్ సింగర్స్‌తో పాటు ప్రేక్షకులతో కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా ఒక సింగింగ్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న క్రమంలో తాను అందరు దేవుళ్లను సమానంగా చూస్తానని, ముఖ్యంగా తనకు జీసస్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు కీరవాణి. అలా చెప్పడం తప్పేమీ కాదు.. కానీ క్రిస్టియన్ మతంలో మాత్రమే వేరేవారిని క్షమించాలని పాఠం ఉంటుందని, వేరే మతాల్లో అలా ఉండదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. అది ఇతర మతాలకు, ముఖ్యంగా హిందువులకు అస్సలు నచ్చలేదు.

Also Read: త్రిషను అవమానించిన స్టార్ హీరో.. కఠిన నిర్ణయం.?

సినిమాలు బ్యాన్ చేయాలి

ఎమ్ఎమ్ కీరవాణి ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌కు సంబంధించిన పాత వీడియోను కొందరు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. దీంతో క్రిస్టియన్ మతంలో మాత్రమే క్షమించే గుణం ఉంటుందని చెప్పడం కరెక్ట్ కాదని మండిపడుతున్నారు. ఇది హిందువులను అవమానించినట్టుగా ఉంటుందని భావిస్తున్నారు. అందుకే కీరవాణి సినిమాలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రవస్తి కాంట్రవర్సీ హాట్ టాపిక్‌గా మారగా.. కీరవాణి జీసస్‌పై ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌కు సంబంధించిన వీడియో కూడా దానికి యాడ్ అయ్యింది. దీంతో కీరవాణిపై మరింత నెగిటివిటీ పెరిగింది. తన మతంపై ఇంత ఓపెన్‌గా నెగిటివ్ కామెంట్ చేసిన వ్యక్తి.. కచ్చితంగా బాడీ షేమింగ్ కూడా చేసే ఉంటాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×