Aloe Vera For Skin : ముఖం అందంగా మెరుస్తూ ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. గ్లోయింగ్ స్కిన్ కోసం వేలల్లో ఖర్చు చేసేవారు లేకపోలేదు. అయినప్పటికీ కొందరు ముఖంపై మొటిమలు, మచ్చల సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు కొన్ని హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. హోం రెమెడీస్ ముఖాన్ని అందంగా మార్చడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం మీకు సహాయపడతాయి. ఇంట్లోనే మీరు ఎలాంటి ఖర్చు లేకుండా హోం రెమెడీస్ తయారు చేసుకుని వాడవచ్చు.
ఇదిలా ఉంటే కలబందతో హోం రెమెడీస్ తయారు చేసుకుని వాడటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. వీటిలో ఉండే పోషకాలు మొటిమలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అంతే కాకుండా కలబంద జెల్ లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో పాటు చర్మానికి మేలు చేసే గుణాలు ఉంటాయి. అందుకే దీనిని తరచూ ముఖానికి వాడటం వల్ల ముఖంపై మచ్చలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా ఉండాలంటే కలబంద వాడటం చాలా మంచిది.
కలబందలో ఉండే అలోయిన్ అనే సమ్మేళనం పోస్ట్ ఇన్ ఫ్లమేటరీ హైనర్ పిగ్మెంటేషన్ అని పిలవబడే నల్లటి మచ్చలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా నల్లటి మచ్చలను కూడా పూర్తిగా రాకుండా చేస్తుంది.
కలబంద, పెరుగు తేనెతో ఫేస్ ప్యాక్:
కావాల్సినవి:
కలబంద- 1 టేబుల్ స్పూన్
పెరుగు-1 టీ స్పూన్
తేనె- 1 టీ స్పూన్
తయారీ విధానం: పైన తెలిపిన అన్ని పదార్థాలను ఒక మిశ్రమం లాగా తయారు చేసుకుని ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాలు ఆరనిచ్చి ఆ తర్వాత శుభ్రం చేయండి. ఇలా తరచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖంపై మొటిమలు రాకుండా ఉండాటానికి కలబంద చాలా బాగా ఉపయోగపడుతుంది.
కలబంద , పసుపుతో ఫేస్ ప్యాక్ :
కావాల్సినవి:
కలబంద- 1 టేబుల్ స్పూన్
పసుపు-1 టీ స్పూన్
తయారీ విధానం: పైన తెలిపిన పదార్థాలను ఒక మిశ్రమం లాగా తయారు చేసుకుని ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాలు ఆరనిచ్చి ఆ తర్వాత శుభ్రం చేయండి. అనంతరం మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ ముఖంపై మొటిమలు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తరచుగా మీరు ఈ ఫేస్ ప్యాక్ వాడటం వల్ల కూడా ముఖం కాంతివంతంగా మారుతుంది. మచ్చలేని చర్మం కోసం అమ్మాయిలు అలోవెరాతో ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకుని వాడటం చాలా మంచిది.
Also Read: సమ్మర్‌లో చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలంటే.. ఈ టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వండి !
కలబంద , పసుపు, తేనె. టమాటో రసం ఫేస్ ప్యాక్ :
కావాల్సినవి:
కలబంద- 1 టేబుల్ స్పూన్
పసుపు-1 టీ స్పూన్
తేనె- 1 టీ స్పూన్
టమాటో రసం- 1 టీ స్పూన్
తయారీ విధానం: పైన తెలిపిన పదార్థాలను ఒక మిశ్రమం లాగా తయారు చేసుకుని ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాలు ఆరనిచ్చి ఆ తర్వాత శుభ్రం చేయండి. ఈ ఫేస్ ప్యాక్ ముఖంపై ఉన్న జిడ్డును తొలగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ముఖాన్ని తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది.