MM Keeravani:ఈ మధ్యకాలంలో సంగీత దర్శకులు ఎక్కువగా సంగీత కచేరీలు నిర్వహిస్తూ శ్రోతలను మైమరిపిస్తున్న విషయం తెలిసిందే. అటు సంగీత దర్శకులే కాదు ఇటు కొరియోగ్రాఫర్లు కూడా లైవ్ ఈవెంట్స్ నిర్వహిస్తూ అభిమానులకు చేరువవుతున్నారు. ఇక ఇప్పుడు ఆస్కార్ గ్రహీత ఎం.ఎం. కీరవాణి (MM.Keeravani) కూడా సంగీత కచేరి నిర్వహించడానికి సిద్ధం అయ్యారు. దాదాపు 83 మంది కళాకారుల ఆర్కెస్ట్రాతో ఆయన ఈ కచేరి నిర్వహించనున్నట్లు సమాచారం.
83 మంది కళాకారుల ఆర్కెస్ట్రాతో కీరవాణి ‘నా టూర్’..
హైదరాబాద్ హైటెక్ సిటీలో మార్చి 22వ తేదీన జరిగే ‘నా టూర్’అనే గ్రాండ్ లైవ్ కచేరీకి ఎం.ఎం.కీరవాణి సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమం 20 సంవత్సరాల తర్వాత హైదరాబాదులో తొలిసారి ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వడం గమనార్హం. అంతేకాదు తొలిసారి 83 మంది కళాకారుల ఆర్కెస్ట్రాతో కలిసి ఆయన ఈ లైవ్ కచేరి ఇవ్వనున్నారు. వివిధ భాషలలో తన కాలాతీత స్వర కల్పనలకు పేరుగాంచిన కీరవాణి.. అన్ని వయసుల ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సంగీత అనుభవాన్ని అందిస్తున్నారు.
ఈ లైవ్ కచేరి గురించి ఆయన మాట్లాడుతూ..” ఈ లైవ్ షోలో అన్ని వయసుల వారికి చెందిన విభిన్న సంగీత ప్రియుల సమూహాన్ని నేను ఆశిస్తున్నాను.. తప్పకుండా ఇందులో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను” అంటూ తెలిపారు.
ఫస్ట్ ఛాయిస్ వారిదే..
ఇకపోతే అభిమానుల అభ్యర్థనల ఆధారంగానే తెలుగు, హిందీ క్లాసికల్ పాటలను మిళితం చేస్తూ.. దాదాపు 30 పాటలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇందులో అందరికీ ఇష్టమైన క్లాసిక్ పాటలతో పాటు తాజాగా హిట్ అయిన పాటల్ని కూడా ఆలపించనున్నారు. అంతేకాదు భక్తి శ్రావ్యమైన పాటలు తోపాటు స్పెషల్ పాటలకి కూడా ఇందులో అవకాశం కల్పించబడింది అని కీరవాణి తెలిపారు. మొత్తానికి అయితే ఇక్కడ మొదటి ఛాయిస్ అభిమానులకు ఇచ్చి, వారి అభ్యర్థనల మేరకే 30 పాటలను సెలెక్ట్ చేసినట్లు సమాచారం.
ఆ 30 పాటలు ఏవంటే..?
ఇకపోతే రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు కీరవాణి. ఈ సినిమా నుండి వచ్చిన ‘నాటు నాటు’ పాటతో ఏకంగా ఆస్కార్ అవార్డ్ తో పాటూ గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా అందుకున్నారు. ఇక తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం చిత్రాలలో మ్యూజిక్ డైరెక్టర్గా పేరు దక్కించుకున్న ఈయన.. ‘క్షణక్షణం’, ‘ఘరానా మొగుడు’, ‘ఈగ’, ‘క్రిమినల్’, ‘స్టూడెంట్ నెంబర్ వన్’, ‘మగధీర’, ‘బాహుబలి’ సిరీస్ లతో పాటు ‘జఖ్మ్’ వంటి పాపులర్ సినిమాలకు సంగీతాన్ని అందించారు.
“బంగారు కోడిపెట్ట” కావాలంటున్న చిరంజీవి..
ఇకపోతే హైదరాబాదులో కీరవాణి లైవ్ కచేరి నిర్వహిస్తున్న నేపద్యంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రత్యేకంచి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘ఘరానా మొగుడు’ నుండి ఐకానిక్ “బంగారు కోడిపెట్ట” వినాలనే కోరిక నాలో కలిగింది అంటూ పోస్ట్ పెట్టడంతో ఇక ఈ కచేరీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా కీరవాణి లెజెండ్రీ బ్యాగ్రౌండ్ ప్రత్యక్షంగా అనుభవించాలనే కోరిక ఉందని అటు రాజమౌళి కూడా తెలిపారు. మొత్తానికైతే స్టార్ సెలబ్రిటీలు కూడా ఈ కచేరి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి మార్చి 22వ తేదీన జరగబోయే ఈ లైవ్ కాన్సర్ట్ సక్సెస్ అవ్వాలని అభిమానులు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.