David Warner: ఈరోజుల్లో సినిమాల్లో హీరో, హీరోయిన్‌గా నటించేవారికి ఎంత రెమ్యునరేషన్ అందుతుందో.. కాసేపు అలా వచ్చి ఇలా వెళ్లిపోయే గెస్ట్ రోల్స్‌కు కూడా అదే రేంజ్‌లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు నటీనటులు. సినిమా మొత్తం కష్టపడడం కంటే వారం రోజులు కాల్ షీట్స్ ఇచ్చేస్తే అదే రేంజ్‌లో సంపాదించుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. ఇక సినీ యాక్టర్లు మాత్రమే కాదు.. వెండితెరపై వెలగాలనుకుంటున్న క్రికెటర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉందని తెలుస్తోంది. ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయిన డేవిడ్ వార్నర్ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. ఇప్పుడు తెలుగు సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి అవకాశం రాగానే ఆలోచించకుండా కోట్లలో డిమాండ్ చేశాడని సమాచారం.
తెలుగు డెబ్యూ
కోలీడ్ సమయంలో చాలామంది నెటిజన్లు రీల్స్, డబ్‌స్మాష్‌లకు అలవాటు పడ్డారు. అలాగే ఒక ఆస్ట్రేలియన్ క్రికెటర్ కూడా తెలుగు పాటలకు, డైలాగులకు, సినిమాకు ఫిదా అయ్యి వాటిపై రీల్స్ చేయడం మొదలుపెట్టాడు. తనే డేవిడ్ వార్నర్. ముఖ్యంగా సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాను డేవిడ్ వార్నర్ ప్రమోట్ చేసినంతగా ఇంకెవ్వరూ చేయలేదని అప్పట్లో నెటిజన్లు జోకులు కూడా వేసుకున్నారు. అలా తెలుగు ప్రేక్షకుల ఫోకస్ డేవిడ్ వార్నర్‌పై పడింది. ఎప్పటికైనా తను తెలుగు సినిమాల్లో నటిస్తాడని అందరూ ఊహించారు. అనుకున్నట్టుగానే తన మొదటి తెలుగు చిత్రంతో డెబ్యూ చేయడానికి వార్నర్ సిద్ధమయ్యాడు.
రెమ్యునరేషన్ ఎంతంటే.?
నితిన్ (Nithiin) హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాబిన్‌హుడ్’ సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టనున్నాడు డేవిడ్ వార్నర్. ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ చేస్తున్నాడనే విషయం చాలాకాలం క్రితమే బయటపడింది. ఈ మూవీ షూటింగ్‌లో తను పాల్గొన్న ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యి అప్పట్లో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేశాయి. కొన్నిరోజుల క్రితం నిర్మాత రవి శంకర్ స్వయంగా ‘రాబిన్‌హుడ్’లో డేవిడ్ వార్నర్ ఉన్నాడు అనే విషయాన్ని ప్రకటించారు. తాజాగా ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. అప్పటినుండి ఈ సినిమా కోసం డేవిడ్ వార్నర్ తీసుకున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: ‘పుష్ప 3’ రిలీజ్ డేట్ లాక్.. పుష్పగాడి ర్యాంపేజ్ షురూ.!
ప్రమోషన్స్ కోసం కూడా
కాసేపు ‘రాబిన్‌హుడ్’ (Robinhood) సినిమాలో మెరవడం కోసం డేవిడ్ వార్నర్ (David Warner) రూ.3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కాసేపు అలా వచ్చి ఇలా వెళ్లిపోయే పాత్ర కోసం ఏకంగా అన్ని కోట్లు డిమాండ్ చేశాడా అంటూ ప్రేక్షకులు చర్చించుకోవడం మొదలుపెట్టారు. పైగా ఈ మూవీని ప్రమోట్ చేయడం కోసం హైదరాబాద్‌కు రమ్మని డేవిడ్ వార్నర్‌ను స్పెషల్‌గా కోరింది ‘రాబిన్‌హుడ్’ టీమ్. ఇక తానే రంగంలోకి దిగి ప్రమోట్ చేయడం కోసం ఏకంగా రూ.1 కోటి డిమాండ్ చేశాడట ఈ స్టార్ క్రికెటర్. దీంతో ఐపీఎల్ ఆక్షన్ మిస్ అయినా సినిమా ద్వారా తనకు రావాల్సిన డబ్బును రాబట్టుకున్నాడంటూ డేవిడ్ వార్నర్‌పై కామెంట్స్ వినిపిస్తున్నాయి.