BigTV English

Hit 3: ‘హిట్ 3’లో బాలీవుడ్ యంగ్ హీరో.. ఊహించని సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన మేకర్స్..

Hit 3: ‘హిట్ 3’లో బాలీవుడ్ యంగ్ హీరో.. ఊహించని సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన మేకర్స్..

Hit 3: ఈరోజుల్లో చాలామంది బాలీవుడ్ నటీనటులు తెలుగు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సీనియర్లు మాత్రమే కాదు.. అప్‌కమింగ్ బీ టౌన్ ఆర్టిస్టులు కూడా తెలుగు తెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నారు. అలా ఇప్పటికే పలువురు బాలీవుడ్ యంగ్ హీరోలు తెలుగులో నటించడానికి సిద్ధమవుతుండగా.. మరొక యాక్టర్ కూడా సైలెంట్‌గా తెలుగులో డెబ్యూ ఇచ్చేశాడనే వార్త బయటికొచ్చింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘హిట్ 3’ సినిమాలో ఒక బాలీవుడ్ యంగ్ హీరో నటించాడనే విషయాన్ని ఇప్పటివరకు మేకర్స్ బయటపెట్టలేదు. కానీ ఈ విషయాన్ని ఆ నటుడే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. అంతే కాకుండా నాని గురించి చాలా గొప్పగా మాట్లాడాడు కూడా.


బాలీవుడ్ యంగ్ హీరో

హాలీవుడ్‌లో యాక్షన్ యూనివర్స్‌లు ఉన్నట్టుగా టాలీవుడ్‌లో ఒక క్రైమ్ యూనివర్స్ ప్రారంభమయ్యింది. అదే హిట్‌వర్స్. ఆ యూనివర్స్ క్రియేట్ అవ్వడానికి కారణం నాని (Nani). శైలేష్ కొలనును దర్శకుడిగా పరిచయం చేస్తూ హిట్ ఫ్రాంచైజ్‌ను నిర్మించడం మొదలుపెట్టాడు నేచురల్ స్టార్. అలా ఈ ఫ్రాంచైజ్‌లో ఇప్పటికే రెండు సినిమాలు విడుదలయ్యాయి. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ‘హిట్ 1’, అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ‘హిట్ 2’.. రెండూ సూపర్ డూపర్ హిట్‌ను సాధించాయి. ఇక ‘హిట్ 3’ కోసం కేవలం నిర్మాతగా కాకుండా హీరోగా కూడా మారాడు నాని. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాగా.. ఇందులో ఒక బాలీవుడ్ యంగ్ హీరో నటిస్తున్నాడనే విషయం తాజాగా బయటపడింది.


అప్డేట్స్ అందించాడు

ఇటీవల థియేటర్లో విడుదలయ్యి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న హిందీ చిత్రం ‘సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలీగన్’. ఆ మూవీలో నలుగురు హీరోలు ఉండగా అందులో ఒకడు సఖీబ్ ఆయూబ్. ఇంతకు ముందు కూడా పలు హిందీ సినిమాల్లో, వెబ్ సిరీస్‌లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సఖీబ్.. ‘హిట్ 3’తో తెలుగులో డెబ్యూ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. ఈ విషయాన్ని తనే స్వయంగా తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. అయితే ఇప్పటివరకు ‘హిట్ 3’ నుండి ఒక్క టీజర్ విడుదలయ్యింది తప్పా అంతకు మించి ఎలాంటి అప్డేట్స్ బయటికి రాలేదు. ఆ అప్డేట్స్ అన్నింటికి సఖీబ్ ప్రేక్షకులకు అందించాడు.

Also Read: ‘కల్కి 2’పై గూస్‌బంప్స్ తెప్పించే అప్డేట్ ఇచ్చిన బిగ్ బి.. పూనకాలు లోడింగ్..

నాని ఫోన్ చేశాడు

‘‘హిట్ 3 (Hit 3) సినిమా దేశవ్యాప్తంగా చిత్రీకరణ జరుపుకుంది. కశ్మీర్, బిహార్, హైదరాబాద్ ఇలా చాలా ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. ఫలానా పాత్రలో నటించాలని నాని నాకు స్వయంగా ఫోన్ చేసినప్పుడు నేను షాకయ్యాను. నా అదృష్టంకొద్దీ అన్నీ కరెక్ట్‌గా వర్కవుట్ అయ్యాయి. సౌత్ ఇండస్ట్రీలో నానిని అంతగా ఎందుకు ప్రశంసిస్తారో నాకు అప్పుడే అర్థమయ్యింది. నాకు భాష రాదని కొంచెం భయముంది. కానీ ఈ సినిమాలో నేను ఒక హిందీ కుర్రాడిగానే కనిపిస్తాను కాబట్టి అది నాకు ప్లస్ అయ్యింది. ఇలాగే మరికొన్ని సౌత్ చిత్రాల్లో నటించాలని ఉంది’’ అంటూ నాని గురించి, ‘హిట్ 3’ గురించి చెప్పుకొచ్చాడు సఖీబ్ ఆయూబ్ (Saqib Ayub).

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×