BigTV English

Mohan Babu : మీడియాకు క్షమాపణలు చెప్పిన మోహన్ బాబు.. లెటర్ లో ఏముందంటే..?

Mohan Babu : మీడియాకు క్షమాపణలు చెప్పిన మోహన్ బాబు.. లెటర్ లో ఏముందంటే..?

Mohan Babu : మోహన్ బాబు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల గురించి అందరికి తెలిసిందే. గత ఐదు రోజుల నుంచి ఈ గొడవలు ఉత్కంఠగా మారాయి. తండ్రి, కొడుకుల మధ్య జరుగుతున్న గొడవలు ఫ్యామిలీ నుంచి రోడ్డు కేక్కాయి. ఈ గొడవల పై పోలీసులు కూడా సీరియస్ అయ్యారు. అటు మోహన్ బాబు ఇంటి దగ్గర కవరేజ్ కోసం వెళ్లిన మీడియా పై మోహన్ బాబు విచక్షణా రహితంగా దాడికి దిగాడు. దాంతో ఫ్యామిలీ గొడవ కాస్త మీడియా ప్రతినిధులకు, మోహన్ బాబుకు మధ్య కోల్డ్ వార్ అయ్యింది. ఫిలిం ఛాంబర్ వద్ద జర్నలిస్ట్ ల సంఘాలు నిరసనకు దిగాయి. జర్నలిస్ట్ పై దాడి చేసినందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ మోహన్ బాబు మాత్రం నిన్నటి వరకు నాదేం తప్పులేదు. నేను క్షమాపణలు చెప్పను అని భీష్మించుకొని కూర్చున్నాడు. తాజాగా గాయపడిన మీడియా ప్రతినిధికి క్షమాపణలు చెప్తూ ఒక లేఖ రాసారు. ప్రస్తుతం ఆ లెటర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..


మంచు ఫ్యామిలీ గొడవలకు కారణాలు..? 

గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ గొడవలు వార్తల్లో హైలెట్ అవుతున్నాయి. మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య వార్ జరుగుతుంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుస్తుంది. వాటి గురించి మోహన్ బాబు ఫ్యామిలీ గొప్యంగా ఉంచింది. కానీ మనోజ్ పై దాడి జరగడంతో ఈ గొడవలు అగ్గి రాజుకున్నాయి. మనోజ్ తన తండ్రి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా మోహన్ బాబు కూడా మనోజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ గొడవల వల్ల మోహన్ బాబు మనోజ్ ను ఇంట్లోకి రాకుండా చేసాడు. అది సహించలేని మనోజ్ బలవంతంగా గేట్లను ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు.. ఈ గొడవల కవరేజ్ ను కవర్ చెయ్యడానికి వెలికిన మీడియా పై కోపంగా ఉన్న మోహన్ బాబు దాడి చేసాడు. ఆ దాడిలో ఒక వ్యక్తికి గాయాలు అయ్యాయి. దాంతో జర్నలిస్ట్లు ఫిలిం ఛాంబర్ ఎదుట బైటాయించి నిరసన చేశారు. దాంతో మోహన్ బాబు ఏదో కోపంతో చేశాను గాయపడినందుకు చింతిస్తున్నాను అంటూ ఆడియో రిలీజ్ చేసాడు. ఇక ఉదయం మీడియా ప్రతినిధికి క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియాలో ఒక లెటర్ ను పోస్ట్ చేసాడు.


లెటర్ లో ఏముందంటే..?

జర్నలిస్ట్‌పై దాడి చేసిన వెంటనే అనారోగ్యంతో మోహన్‌ బాబు ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యారు, రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్‌ అయ్యారు. మోహన్‌ బాబు దాడిపై స్పందించారు. జర్నలిస్ట్‌లకు క్షమాపణలు తెలియజేశారు. ఆ క్షణంలో గేటు విరగొట్టి 30 మంది లోనికి ఉరుక్కుంటూ వస్తుంటే సంఘ వ్యతిరేక శక్తులు వస్తున్నారేమో అని నేను ఆందోళనతో ఆ పని చేశాను. మీడియా మిత్రుడిపై అనుకోకుండా దాడి చేయడం జరిగింది. తన వల్ల జరిగిన ఇబ్బందికి క్షమాపణలు చెబుతున్నాను. జర్నలిస్ట్‌ మిత్రుడు కుటుంబానికి హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను. మీకు, మీ కుటుంబానికి కలిగిన మనోవేదనకు చింతిస్తున్నాను అంటూ లేఖలో పేర్కొన్నారు.. కోపంలో అలా చేశాను. ఉద్దేశ్యపూర్వకంగా చెయ్యలేదు అని ఆ లెటర్ లో పేర్కొన్నారు.. మోహన్‌ బాబు దాడి నేపథ్యంలో ఇప్పటికే కేసు నమోదు అయ్యింది. జర్నలిస్ట్‌లు రోడ్ల మీదకు వచ్చి మోహన్‌ బాబు క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్‌ చేశారు. ఆయన క్షమాపణలు చెప్పడంతో గొడవ సర్దుమనిగినట్లు అయ్యింది. అయితే బాధితుడు ఆసుపత్రి ఖర్చుల విషయంలో మంచు ఫ్యామిలీ స్పందిస్తుందేమో చూడాలి..

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×