Manchu Manoj: గత కొన్ని రోజులుగా మంచు మోహన్ బాబు ఇంట్లో ఆస్తి తగదాలకు సంబంధించిన గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాల క్రితం మంచు మనోజ్ వీడియో ఒకటి వైరల్ గా మారింది. చూడండి ఇంటికి వచ్చి మా మనుషుల్ని ఎలా కొడుతున్నారు అంటూ ఆ వీడియోలు మంచు మనోజ్ వాయిస్ వినిపిస్తుంది. అదే వీడియోలు కోపంగా ఉన్న విష్ణు ను మనం గమనించవచ్చు. అయితే అప్పట్లో మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారింది. దానిని కప్పిపుచ్చే ప్రయత్నంలో ఇది ఒక రియాల్టీ షో అంటూ మంచు విష్ణు కవర్ చేశాడు కానీ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో ఏ స్థాయిలో మంచు ఫ్యామిలీ గురించి వార్తలు వస్తున్నాయి తెలిసిన విషయమే ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకొని హాస్పిటల్ కి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇకపోతే ఈ వివాదం రోజురోజుకీ కొత్త మలుపు తిరుగుతుంది. ఈ వివాదానికి సంబంధించి ఇప్పటివరకు మోహన్ బాబు రెండు ఆడియోలు కూడా రిలీజ్ చేశారు. ఏదేమైనా ఈ వివాదం చాలా గట్టిగానే జరిగేటట్టుంది ఈ తరుణంలో ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మంచు మనోజ్ మోహన్ బాబు ఇంట్లో అరుస్తూ మాట్లాడుతున్న వీడియో ఒకటి లీక్ అయింది. ఈ వీడియోలో మనోజ్ మా ఇంట్లో కొచ్చి నువ్వు చెప్పేది ఏంట్రా అని ఒక వ్యక్తి మీద అంటున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ వీడియో రిలీజ్ అవ్వడానికంటే ముందు మోహన్ బాబు మాట్లాడుతూ మన ఇంట్లో పని వాళ్ళని కొట్టడం తప్పురా. తాగడం తప్పురా. నేను కూడా తాగుతాను కానీ మరి ఓవర్ గా తాగను అంటూ చెప్పిన ఆడియో ఒకటి వైరల్ అయింది.
ఇకపోతే మొదట మోహన్ బాబు కంప్లైంట్ ఇచ్చిన దానిని బట్టి మా ఇంట్లో కొచ్చి పని వాళ్ళ మీద చేయి చేసుకున్నాడు అంటూ తన కంప్లైంట్ లో రాసుకొచ్చాడు. కానీ మనోజ్ వెర్షన్ నా మీద తన మనుషులు దాడి చేశారు. అంటూ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఎవరెవరి మీద దాడి చేశారు అనేది పక్కన పెడితే, మోహన్ బాబు చెప్పినట్లు కుటుంబ గొడవలు అనేది ప్రతి ఇళ్లల్లోనే ఉంటాయి. అలా లేని ఇల్లు ఉంటే వాళ్ళ కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటా అని చెప్పాడు. ప్రతి ఇంట్లో కుటుంబ సమస్యలు ఉంటాయి అనే మాట వాస్తవమే కానీ ఆ కుటుంబ సమస్యలను రహస్యంగా క్లియర్ చేసుకోవాలి. సెలబ్రిటీస్ కాబట్టి మరీ బయటపడకుండా ఏమున్నా వాళ్లు వాళ్లు మాట్లాడుకోవాలి. ఈ తరుణంలో మోహన్ బాబు కూడా ఒక జర్నలిస్ట్ పైన దాడి చేయడం జరిగింది. దానికి కూడా క్షమాపణ చెప్తూ మోహన్ బాబు ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఏదేమైనా అందరూ కూర్చొని సక్రమంగా ఈ ఇష్యూ క్లియర్ అయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది అని కొంతమంది సినిమా ప్రముఖులు చెబుతున్నారు.
Also Read : Allu Arjun : అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ..? పార్టీ పేరేంటో తెలుసా..?