Mohan Babu:అటు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన అంశం మంచు కుటుంబం (Manchu Family) లో గొడవలు. ముఖ్యంగా ఆస్తుల కోసమే ఈ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నా.. ఎట్టకేలకు ఈ వార్తలు నిజమయ్యాయి. నాలుగు గోడల మధ్య సమస్యను పరిష్కరించుకోవాల్సిన వీరు రోడ్డుకెక్కడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే శంషాబాద్ జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు(Mohanbabu) ఇంటి వద్ద మంచు మనోజ్ (Manchu Manoj)తో జరిగిన గొడవ వల్ల హై బీపీతో స్పృహ తప్పి పడిపోయారు మోహన్ బాబు. దీంతో హుటా హుటిన మంచు విష్ణు(Manchu Vishnu) కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించారు. రెండు రోజులపాటు హాస్పిటల్ లో చికిత్స అందుకున్న మోహన్ బాబు.. తాజాగా డిశ్చార్జ్ అయ్యారు.ప్రస్తుతం మోహన్ బాబు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యలు తెలిపినట్లు సమాచారం.
మోహన్ బాబు ఆరోగ్యంపై వైద్యులు ఏమన్నారంటే..?
తాజాగా కాంటినెంటల్ హాస్పిటల్ నుండి మోహన్ బాబు డిశ్చార్జ్ అవ్వగా.. ఆయన ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు ఇలా తెలియజేశారు. ప్రస్తుతం మోహన్ బాబు ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. తాజాగా వచ్చిన అన్ని మెడికల్ రిపోర్ట్స్ కూడా క్లియర్ గా ఉన్నాయట. ఇక ఈ విషయం తెలిసిన తర్వాత ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు సమాచారం.
స్పృహ తప్పి పడిపోయిన మోహన్ బాబు..
తనకు, తన తండ్రి నుంచి ప్రాణహాని ఉందని, మనోజ్ (Manoj) డీజీపీ, డీజీని కలిసి ఇంటికి వచ్చే సమయంలో మోహన్ బాబు ఇంటిదగ్గర సెక్యూరిటీ వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో మనోజ్ గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లిపోయారు. ఇక అదే సమయంలో అక్కడికి వచ్చిన మోహన్ బాబు మీడియా వారిపై దాడి చేశాడు. ఆ తర్వాత హై బీపీ కారణంగా స్పృహ తప్పి పడిపోవడంతో విష్ణు ఆయనను హాస్పిటల్ కి తరలించారు.
మోహన్ బాబు అనుచరులు అరెస్ట్..
మోహన్ బాబు ప్రధాన ఆదాయ వనరైన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల్లో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని మోహన్ బాబును నేరుగా ప్రశ్నించారట మంచు విష్ణు (Manchu Vishnu). ఆ సమయంలో అక్కడే ఉన్న మోహన్ బాబు ప్రధాన అధికారి వినయ్(Vinay), మంచు మనోజ్ పై దాడి చేసినట్లు సమాచారం. అంతే కాదు గాయాలతో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో తనపై గుర్తుతెలియని పదిమంది దాడి చేశారని పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా.. అందులో కిరణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా, వినయ్ రెడ్డి కోసం గాలిస్తున్నట్లు సమాచారం.
ఆస్తి కోసమేనా..?
మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవలు ఆస్తి కోసమేనా అనే అనుమానాలకు దారితీస్తోంది. అయితే ఆస్తుల కోసం అంటూ కొంతమంది కామెంట్ చేస్తుంటే.. మంచు మనోజ్ మాత్రం తాను డబ్బు, ఆస్తి కోసం కాదని, ఆత్మవిశ్వాసం కోసమే పోరాటం చేస్తున్నానని తెలిపారు. ముఖ్యంగా తనపై దొంగతనం కేసు వేశారని, తాను దొంగతనం చేయలేదని.. తిరుపతి విద్యాసంస్థలలో చాలావరకు తమ బంధువుల పిల్లల చదువుతున్నారని, వారి విషయంలో ఆర్థిక ప్రలోభాలకు పాల్పడినట్లు పిల్లల తల్లిదండ్రులు తనతో చెప్పుకోవడం వల్లే తాను వారికి అండగా నిలబడ్డానని, కానీ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బాధపడ్డారు మంచు మనోజ్. ఇకపోతే నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహిస్తానని అన్ని సాక్ష్యాలు బయటపెడతానని చెప్పిన మంచు మనోజ్, రాచకొండ పోలీసుల సలహా మేరకు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.