Mohan Babu: సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu) ఇప్పటికి పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు. త్వరలోనే మోహన్ బాబు తన కొడుకు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప సినిమా(Kannappa Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు మహదేవ్ శాస్త్రి అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం పెద్ద ఎత్తున మీడియా సమావేశాలలో పాల్గొంటున్నారు.
శివ రాజ్ కుమార్ …
ఇకపోతే ఇటీవల చెన్నైలో నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా మోహన్ బాబు కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ఈ సినిమాలో నటించిన మరొక స్టార్ హీరో శివ రాజ్ కుమార్ (Shivaraj Kumar)కూడా పాల్గొన్నారు. శివ రాజ్ కుమార్ కన్నడ చిత్రపరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈయన ఇతర భాష సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇక ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా మోహన్ బాబు మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
విలన్ గా నటించాలని ఉంది…
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంటనే హీరోగా సినిమాలు చేయలేదని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, విలన్ పాత్రలలో నటించి అనంతరం హీరోగా అవకాశాలు అందుకున్నానని తెలిపారు.. ఇలా ఆ భగవంతుడు దయవల్ల ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నానని మోహన్ బాబు తెలిపారు. అయితే నాకు ఎప్పటినుంచో ఒక చిరకాల కోరిక ఉందని తెలిపారు. నేను ప్రముఖ నటుడు రాజ్ కుమార్ తనయుడు అయిన శివరాజ్ కుమార్ గారి సినిమాలో నటించాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నాను కానీ ఇప్పటివరకు నాకు ఆ కోరిక నెరవేరలేదు.
ఇక పక్కనే కూర్చున్న శివరాజ్ కుమార్ ని ఉద్దేశిస్తూ మీరు తదుపరి చేయబోయే సినిమాలో నాకు విలన్ పాత్రలో నటించే అవకాశం ఇవ్వండి. నేను ఈ విషయాన్ని చాలా ప్రాదేయపడుతూ అడుగుతున్నాను ఇదే నా లైఫ్ ఆంబీషన్. నా ఈ కోరికను తీర్చండి అంటూ వేదికపైనే శివరాజ్ కుమార్ చేతులు పట్టుకొని మోహన్ బాబు ప్రాధేయ పడ్డారు. ఇలా శివరాజ్ కుమార్ హీరోగా చేస్తే తాను విలన్ పాత్రలో నటించాలని కోరుకుంటున్నాను అంటూ మోహన్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక మోహన్ బాబు విలన్ గా ఎన్నో సినిమాలలో నటించి అద్భుతమైన ఆదరణ, పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరి మోహన్ బాబు ఈ చిరకాల కోరికను శివరాజ్ కుమార్ నెరవేరుస్తారా? తన తదుపరి సినిమాలో విలన్ గా అవకాశం ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం మోహన్ బాబు కథ ప్రాధాన్యత ఉన్న కీలకమైన పాత్రలలో మాత్రమే నటిస్తున్నారు.