MohanBabu:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ గా గుర్తింపు తెచ్చుకున్న కుటుంబాలలో మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu)కుటుంబం కూడా ఒకటి. క్రమశిక్షణకు మారుపేరైన ఈ కుటుంబంలో ఆస్తుల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుతున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు మంచుమనోజ్ (Manchu Manoj)రెండో వివాహం చేసుకోవడం ఇష్టంలేని మంచు విష్ణు(Manchu Vishnu)దంపతులు కూడా మనోజ్ పెళ్లిలో గెస్ట్ గానే వచ్చి వెళ్ళిపోయారు. దీనికి తోడు మంచు విష్ణు.. మనోజ్ అనుచరుడి పైన దాడి చేసినప్పుడు, ఆ వీడియోని మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయని అప్పుడు బహిర్గతం అయింది.
తండ్రీ కొడుకుల పరస్పర ఫిర్యాదు..
అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. గతంలో మంచు మనోజ్ ని మోహన్ బాబు గత కొన్నేళ్లుగా దూరంగా ఉంచుతున్నారనే వార్తలు రాగా.. ఇప్పుడు ఏకంగా మనోజ్ పై దాడి చేశారట.గాయాలతోనే హైదరాబాదులోని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో తన తండ్రి మోహన్ బాబు పై కంప్లైంట్ ఇచ్చారు మంచు మనోజ్. అంతే కాదు ఆయన భార్య భూమా మౌనిక రెడ్డి(Bhuma Mounika Reddy)పై కూడా మోహన్ బాబు దాడి చేసినట్లు పోలీసుల ఫిర్యాదులో తెలిపారు. గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో మంచు మోహన్ బాబుకు సంబంధించిన విద్యానికేతన్ విద్యాసంస్థలతో పాటు ఇతర ఆస్తుల పంపకాల విషయంలోనే అవకతవకలు జరిగాయని, దీంతో మంచు మనోజ్ తన ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడని వస్తున్న వార్తలకు ఇది మరింత బలాన్ని చేకూర్చింది.
వైరల్ వార్తలపై పీ.ఆర్.టీమ్ స్పందన..
అయితే ఇలా వార్తలు వైరల్ అయ్యాయో లేదో వెంటనే మోహన్ బాబు కుటుంబం స్పందించి, ఈ వార్తలకు చెక్ పెట్టింది. మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తల్లో నిజం లేదు.. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు కొంతమంది ఊహాజనితమైన కథనాలను ప్రచారం చేస్తున్నారు. ఎవిడెన్స్ లు లేకుండా అసత్య ప్రచారాలు చేయకండి అంటూ కొన్ని మీడియా ఛానల్స్ పై మంచి మోహన్ బాబు కుటుంబం ఫైర్ అయ్యింది.
గొడవలు నిజమే అంటూ కన్ఫామ్ చేసిన డీసీపీ..
కానీ ఈ విషయంపై తాజాగా డీసీపీ కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. డయల్ 100 కి ఇద్దరు ఫోన్ చేసి ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకున్నారట. మహేశ్వరం పోలీస్ స్టేషన్లో డయల్ 100 కి కాల్ చేసినట్లు డీసీపీ తెలిపినట్లు సమాచారం. మోహన్ బాబు కాలేజీ యూనివర్సిటీ వ్యవహారాలు చూసుకునే వినయ్ తనపై దాడి చేసి కొట్టాడని, తన తండ్రి ప్రమేయంతోనే వినయ్ వినయ్ రౌడీ మూకలతో కలిసి తనపై దాడి చేశారు అని మనోజ్ తన కంప్లైంట్ లో పేర్కొన్నట్లు తెలిపారని తెలిసింది. మొత్తానికైతే గొడవలను మోహన్ బాబు కుటుంబం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నా.. తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెడుతున్నారు మంచు మనోజ్. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.