BigTV English

BRICS Jaishankar: భారత్ డాలర్‌కు వ్యతిరేకం కాదు.. ట్రంప్ బ్రిక్స్ హెచ్చరికపై స్పందించిన జైశంకర్

BRICS Jaishankar: భారత్ డాలర్‌కు వ్యతిరేకం కాదు.. ట్రంప్ బ్రిక్స్ హెచ్చరికపై స్పందించిన జైశంకర్

BRICS Jaishankar| అంతర్జాతీయ కరెన్సీ అమెరికన్ డాలర్‌కు భారత దేశం వ్యతిరేకం కాదని బ్రిక్స్ కొత్త కరెన్సీ గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. వారం రోజుల క్రితం అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలపై 100 శాతం పన్నులు విధిస్తానని హెచ్చరించారు. అమెరికా డాలర్ కు పోటీగా ఇతర కరెన్సీ తీసుకొస్తే.. వారితో సంబంధాలు తెంచుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.


ఇండియా, చైనా, రష్యా, యుఎఇ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ లాంటి దేశాలన్నీ బ్రిక్స్ కూటమిలో ఉన్నాయి. ఈ దేశాలన్నీ అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నంగా లోకల్ కరెన్సీలో ప్రస్తుతం పరస్పరంగా వ్యాపారం సాగిస్తున్నాయి. త్వరలోనే బ్రిక్స్ కోసం కొత్త కరెన్సీ తీసుకురావాలనే యోచనలో కూడా ఉన్నాయి. అయితే డాలర్ కు ప్రత్యామ్నంగా మరో కరెన్సీ గురించి యోచించినా.. ఉపేక్షించేది లేదని ట్రంప్ ఇటీవలే ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: యుద్ధంలో పసికందుల ఏడ్పులు, మహిళల ఆర్తనాదాలు.. అంతా ఫేక్.. ఇజ్రాయెల్ టెక్నిక్ ఇదే..


కతార్ దేశంలో జరుగుతున్న దోహ ఫోరం కార్యక్రమంలో భారత ప్రతినిధిగా జై శంకర్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ భారత్ డాలర్ కు వ్యతిరేకం కాదని.. బ్రిక్స్ కొత్త కరెన్సీ ప్రారంభించేందుకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. “మాకు అమెరికాతో చాలా మంచి సంబంధాలున్నాయి. ముఖ్యంగా ట్రంప్ గత పరిపాలనలో భారత్, అమెరికా మధ్య ఇరు దేశాలు ధృడమైన సంబంధాలు కలిగి ఉన్నాయి. కొన్ని వ్యాపార సంబంధిత సమస్యలు ఉన్నాయి. కానీ అవి ద్వైపాక్షికంగా కాదు. వీటన్నిటికంటే ట్రంప్ అంతర్జాతీయంగా లేవనెత్తిన సమస్యలే ఎక్కువ. నేనొకటి గుర్తు చేయదలచుకుంటున్నాను. ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడే క్వాడ్ (QUAD) దేశాల కూటమి పున:ప్రారంభమైంది.” ఆయన అన్నారు.

భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వ్యక్తగతంగా మంచి స్నేహ సంబంధాలున్నాయని.. ఈ స్నేహమే ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలకు బలం చేకూర్చుతోందని అన్నారు. “ప్రధాని మోడీ, ట్రంప్ మధ్య పర్సనల్ రిలేషన్స్ పాజిటివ్ గా ఉన్నాయి. ఇక బ్రిక్స్ విషయానికి వస్తే.. భారత్ డాలర్‌కు వ్యతిరేకంగా ఎప్పుడూ లేదు. ప్రస్తుతానికి అయితే బ్రిక్స్ కరెన్సీ గురించి ఎటువంటి ప్రతిపాదన చేయలేదు. బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక లావాదేవీల గురించి చర్చలు జరుగుతూ ఉంటాయి. కానీ మాకు వ్యాపార పరంగా అమెరికా చాలా పెద్ద భాగస్వామి. డాలర్ ను బలహీన పరిచేందకు మాకైతే ఆలోచనలు” అని జైశంకర్ వెల్లడించారు.

“బ్రక్స్ దేశాలు కొత్త కరెన్సీ గురించి నిర్ణయించినా, లేదా ఇతర దేశాల కరెన్సీని అమెరికా డాలర్ కు ప్రత్యామ్నంగా మద్దతు పలికినా.. వారందరూ అమెరికాతో సంబంధాలు తెంచుకొని మరో దేశం కోసం వెతుక్కోవాల్సి ఉంటుంది. డాలర్ ను వ్యతిరేకించే దేశాలన్నీ వంద శాతం పన్నులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతే కాదు ఇంతకాలం అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి లాభాలు పొందుతూ వచ్చారు. వారికి ఇక అమెరికా తలుపులు మూసి వేయబడుతాయి.” అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో ఒక వార్నింగ్ పోస్ట్ చేశారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×