Mohini Dey: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ గ్రహీత అయిన ఏఆర్ రెహమాన్ (AR.Rahman)29 సంవత్సరాల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ ఇటీవల విడాకులు ప్రకటించారు. ఇక ఈయన విడాకులు ప్రకటించడంతో యావత్తు సినీ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ వయసులో విడాకులు ఏంటి? అంటూ అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. మరికొంతమంది.. విడాకులు తీసుకోవడానికి వయసు తో సంబంధం లేదు అంటూ కామెంట్లు చేశారు. అయితే ఏ ఆర్ రెహమాన్ విడాకులు ప్రకటించిన కొన్ని గంటలకే ఆయన అసిస్టెంట్ మోహిని కూడా విడాకులు ప్రకటించడంతో కొత్త అనుమానాలు తెరపైకి తెచ్చారు.
విడాకుల లింక్ పై స్పందించిన మోహినిదే..
ఇద్దరూ ఒకేసారి విడాకులు ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకోవడంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జంట విడాకులకు ఏదైనా సంబంధం ఉందా..? అనే చర్చ కూడా ప్రారంభమైంది. తాజాగా దీనిపై మోహినిదే స్పందించారు. ఈ వార్తలను ఖండిస్తూ తమ గోప్యతను గౌరవించాలని కూడా కోరారు. మోహినిదే తన పోస్టులో ఇలా రాసుకుంది.. “నేను విడాకుల ప్రకటన చేసినప్పటి నుంచి ఇంటర్వ్యూల కోసం ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు. వారంతా నా ఇంటర్వ్యూలు ఎందుకు అడుగుతున్నారో కూడా నాకు బాగా తెలుసు. అందరి అభ్యర్థనను నేను గౌరవంగా తిరస్కరిస్తున్నాను. ఎందుకంటే వారు అనుకుంటున్న దాని గురించి నేను మాట్లాడాలని అనుకోవట్లేదు. ఇలాంటి రూమర్స్ పై మాట్లాడి విలువైన సమయాన్ని వృధా చేయాలనుకోవట్లేదు. దయచేసి నా గోప్యతను గౌరవించండి” అంటూ తన ఇన్స్టా లో ఒక పోస్ట్ పెట్టింది. ఇక ఈ విషయంతో ఈమె దీనిపై మాట్లాడడానికి ఆసక్తి చూపించడం లేదనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి.
సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చిన వందన షా..
ఇదిలా ఉండగా మరొకవైపు ఏ.ఆర్. రెహమాన్ భార్య సైరా భాను(Saira Banu)తరపు న్యాయవాది వందన షా(Vandana Sha)కూడా స్పందించారు. వాస్తవానికి ఏ.ఆర్.రెహమాన్ – సైరాభాను విడాకులు తీసుకుంటున్న విషయాన్ని ఈమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇక ఇప్పుడు ఈ కథనాలలో ఎలాంటి నిజం లేదు అని కూడా స్పష్టం చేశారు. వందన షా మాట్లాడుతూ..”ఈ రెండు జంటల విడాకులకు అసలు ఎటువంటి సంబంధం లేదు. పరస్పర అంగీకారంతోనే సైరా-రెహ్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వైవాహిక బంధంలో సైరా వ్యక్తిగతంగా ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. వారిద్దరు విడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. దయచేసి దీనిని కారణంగా చూపించి వారి మధ్య గొడవలు సృష్టించకండి” అంటూ కూడా న్యాయవాది తెలిపింది. ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
విడాకులపై నెటిజన్స్ ఫైర్..
ఇకపోతే సైరాభాను , ఏ.ఆర్ రెహమాన్ పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకున్నారు. మార్చి 4వ తేదీ వరకు ఎదురుచూసి ఉంటే కచ్చితంగా వీరి వైవాహిక బంధానికి మూడు దశాబ్దాలు అయి ఉండేవి. అనూహ్యంగా ఇలా విడాకులు తీసుకోవడంతో అందరూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్దమ్మాయికి పెళ్లి చేశారు కానీ మిగతా అమ్మాయి, అబ్బాయి పరిస్థితి ఏంటి? వారి భవిష్యత్తు గురించి ఆలోచించరా? అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా రెహమాన్ – సైరా భాను విడాకుల ప్రకటన అందరిని ఆశ్చర్యపరిచింది అని చెప్పవచ్చు.