BigTV English

NC 24 : “విరూపాక్ష” డైరెక్టర్ తో కొత్త సినిమా… బర్త్ డే స్పెషల్ గా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన చై

NC 24 : “విరూపాక్ష” డైరెక్టర్ తో కొత్త సినిమా… బర్త్ డే స్పెషల్ గా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన చై

NC 24 : అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) తన పుట్టినరోజు కానుకగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. ఈరోజు నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా నాగ చైతన్యకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున నాగ చైతన్య తన కొత్త సినిమాను ప్రకటించడం విశేషం.


సుకుమార్ రైటింగ్స్ నుంచి రాబోతున్న “NC 24” సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. పౌరాణిక కథ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాను ప్రస్తుతం “NC 24” అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రత్యేక పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమాకు విరూపాక్ష, కాంతారా సినిమాలకు మ్యూజిక్ అందించిన లోకాంత్ సంగీతం అందించబోతున్నారు. ఇది కూడా పాన్ ఇండియా మూవీ రూపొందే ఛాన్స్ ఉంది. ఇందులో హీరోయిన్ గా నటించబోయేది ఎవరు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. దాన్ని బట్టి చూస్తుంటే నాగ చైతన్య (Naga Chaitanya) ట్రెండ్ ను ఫాలో అవుతున్నట్టుగా అన్పిస్తోంది. పోస్టర్ లో నాగ చైతన్య ఏదో వెతుక్కుంటూ వెళ్తున్నట్టుగా కన్పిస్తోంది. మరి అదేంటి? నాగ చైతన్య కొత్త సినిమా కథ ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీ నుంచి మరిన్ని అప్డేట్స్ వచ్చేదాకా వెయిట్ అండ్ సీ.

ఇదిలా ఉండగా ప్రస్తుతం నాగ చైతన్య (Naga Chaitanya) ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో… సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. దేశభక్తి అంశాలతో పాటు ప్రేమ కథగా రూపొందుతున్న ఈ మూవీలో… నాగ చైతన్య రాజు అనే మత్స్యకారుడి పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్లలోకి రాబోతోంది. ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా నాగ చైతన్యతో పాటు సాయి పల్లవి ఈ సినిమాలో డీ గ్లామర్ లుక్స్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. తాజాగా నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. “బుజ్జి తల్లి” పాట ఏకంగా 5 మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్లింది.


మరోవైపు నాగ చైతన్య (Naga Chaitanya) రెండో పెళ్లికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో పెళ్లాడబోతున్నారు. ఈ విషయంపై రీసెంట్ గా నాగార్జున క్లారిటీ ఇవ్వగా, తాజాగా నాగ చైతన్య కూడా కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి పెళ్లి హడావుడి మొదలైపోయింది. ఒక వైపు పెళ్లి, మరో వైపు పాన్ ఇండియా మూవీ, ఇప్పుడేమో కొత్త సినిమా అనౌన్స్మెంట్… చూస్తుంటే నాగ చైతన్యకు ప్రస్తుతం గుడ్ టైం నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×