Mohini Dey on AR Rahman:సంగీత దర్శకులు, ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman)విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన సతీమణి సైరాభాను(Saira Banu)తన తరఫు న్యాయవాది వందన షా (Vandana Sha)సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేకెత్తాయి. 29 సంవత్సరాల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గత నాలుగు నెలల క్రితం అంబానీ ఇంటి జరిగిన పెళ్లి వేడుకలలో కూడా కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన వీరు.. సడన్‌గా విడాకులు ప్రకటించారు. ఈ ఈవెంట్ జరిగి నాలుగు నెలలు కూడా గడవకముందే ఇద్దరి మధ్య విడిపోయేంత మనస్పర్ధలు ఏమొచ్చాయని అభిమానులు సైతం ప్రశ్నిస్తున్నారు.
గురువు దారిలో శిష్యురాలు..
ఇదిలా ఉండగా ఏ.ఆర్ రెహమాన్ , సైరాభాను విడాకుల వార్తలు బయటకొచ్చిన కొన్ని గంటల్లోపే ఆయన అసిస్టెంట్ మోహిని డే (Mohini Dey) కూడా తన భర్త నుంచి విడిపోయినట్టు ప్రకటిస్తూ.. తమ ప్రకటనకు విలువ ఇవ్వాలి అని, తమ గోప్యతను కాపాడాలని కోరింది. ఇలా గురువు విడాకులు ఇచ్చిన కొన్ని గంటల్లోనే శిష్యురాలు కూడా విడాకులు ప్రకటించడంతో ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని రూమర్స్ వచ్చాయి. దీనిపై సైరాభాను తరఫు న్యాయవాది వందన షా కూడా స్పందిస్తూ..”ఈ ఇద్దరి విడాకులకు ఎటువంటి సంబంధం లేదని” క్లారిటీ ఇచ్చింది. అయినా సరే రూమర్స్ మాత్రం ఆగలేదు.
రెహమాన్ కు క్లీన్ చిట్ ఇచ్చిన సైరాభాను..
ఇదిలా ఉండగా వీళ్ళిద్దరిపై పుకార్లు మొదలవడంతో వీటిని ఖండిస్తూ.. రెహమాన్ కూడా కొన్ని మీడియా సంస్థలపై లీగల్ గా చర్యలకు ఉపక్రమించారు. అంతేకాదు రెహమాన్ నుంచి విడిపోయిన తర్వాత ఆయన భార్య సైరాభాను కూడా రెహమాన్ కు క్లీన్ చిట్ ఇచ్చారు.. దీంతో ఇంత వ్యవహారం జరిగిన తర్వాత తాపీగా స్పందించింది రెహమాన్ అసిస్టెంట్ మోహిని డే. రెహమాన్ తో తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూనే.. ఆయన తనకు తండ్రి లాంటివారు అంటూ ప్రకటించింది.
రూమర్స్ పై స్పందించిన మోహిని డే..
తాజాగా ఆమె.. “ఏ ఆర్ రెహమాన్ నాకు తండ్రి లాంటివారు .నా తండ్రి కంటే ఆయన వయసులో కొంచెం చిన్నవాడు అంతే.. రెహమాన్ కూతురిది, నాది ఒకటే వయసు. ఆయన అంటే నాకు ఎంతో గౌరవం, ప్రేమ. రెహమాన్ తో నాది ఎనిమిదిన్నర ఏళ్ల అనుబంధం. తర్వాత నేను అమెరికాకు వెళ్లిపోయి, ఇతర బ్యాండ్స్ తో కలిసి పని చేస్తున్నాను. ఆయన అంటే ఎప్పటికీ గౌర, ప్రేమ ఉంటాయి. ప్రస్తుతం మేమిద్దరం.. మా భాగస్వాముల నుండి విడాకులు తీసుకున్నాము. దయచేసి ఇలాంటి సమయంలో మాకు ప్రైవసీ కల్పించండి. మా వ్యక్తిగత విషయాలను హైలెట్ చేయొద్దు. దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను” అంటూ తెలిపింది మోహిని. ఇకపోతే ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు ప్రకటించి ఏం లాభం అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఏదో ఒక సమయంలో స్పందించింది కదా అంటూ కూడా కామెంట్స్ చేసేవారు లేకపోలేదు.