BigTV English
Advertisement

Shobhitha Dhulipala : పెళ్లి తరువాత శోభిత ధూళిపాళ్ల ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా?

Shobhitha Dhulipala : పెళ్లి తరువాత శోభిత ధూళిపాళ్ల ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా?

Shobhitha Dhulipala : స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల త్వరలోనే అక్కినేని ఇంట్లో కోడలుగా అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్యతో రెండో పెళ్లికి సిద్ధమైన ఈ బ్యూటీ ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీబిజీగా గడిపేస్తోంది. అయితే గత కొంతకాలం నుంచి ఈ హీరోయిన్ నటిస్తున్న సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్లు రావట్లేదు. దీంతో పెళ్లి తర్వాత శోభిత చేయబోయే ఫస్ట్ మూవీ ఏంటి ? అనే ఆసక్తి నెలకొంది. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది.


శోభిత ధూళిపాళ్ల చివరిసారిగా నటించిన వెబ్ ఫిలిం “లవ్ సితార”. ఈ సిరీస్ పర్లేదు అనిపించింది. అయితే ఈ బ్యూటీ ఇప్పటిదాకా గ్లామరస్ అండ్ బోల్డ్ రోల్స్ లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. కానీ నెక్స్ట్ మూవీలో మాత్రం శోభిత తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉన్న ఒక లేడి ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోందని సమాచారం. సరికొత్త జానర్ లో రూపొందబోతున్న ఈ సినిమాలో ’35 చిన్న కథ కాదు’ ఫేమ్ విశ్వదేవ్ రాచకొండ కూడా కీలకపాత్రను పోషించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాకు చంద్ర అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించబోతున్నారని, ఆయన ఈ సినిమాతోనే డైరెక్టర్ గా టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నారని టాక్ నడుస్తోంది. అలాగే ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే మూవీకి సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించగా, నాగ చైతన్య – శోభిత ధూళిపాళ్ల వివాహం తర్వాత షూటింగ్ మళ్లీ స్టార్ట్ కాబోతుందని ఇండస్ట్రీ సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ని కూడా మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా… నాగ చైతన్య, శోభిత ఇదివరకు తమ వివాహాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ గా ప్లాన్ చేశారని వార్తలు విన్పించాయి. కానీ ఇప్పుడు ఆ పెళ్లి వేదికను హైదరాబాద్ కు షిఫ్ట్ చేశానని తెలుస్తోంది. పెళ్లిని హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిపించబోతున్నట్టు నాగర్జున కూడా కన్ఫామ్ చేశారు. చై, శోభిత పెళ్లి కోసం ఓ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అన్నపూర్ణ స్టూడియోలో స్పెషల్ గా సెట్ చేయబోతున్నట్టుగా టాక్ నడుస్తోంది. ఇక వీరి పెళ్లికి అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నారని అంటున్నారు. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు శర వేగంగా జరుగుతున్నాయి. చై, నాగ చైతన్య డిసెంబర్ 4న పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. కాగా ఇప్పటికే శోభిత గూడాచారి, మేడిన్ హెవెన్, నైట్ మేనేజర్, పొన్నియన్ సెల్వన్, ఘోస్ట్ స్టోరీస్ వంటి సినిమాల్లో నటించి, మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈ బ్యూటీ ‘మంకీ మ్యాన్’ సినిమాతో హాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టింది. మొత్తానికి నాగ చైతన్యతో పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ్ల ఫస్ట్ మూవీ సురేష్ ప్రొడక్షన్స్ లో నిర్మితమవుతుండడం విశేషం. ఇక ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా అయితే గనక ఈ జానర్ లో శోభిత చేయబోయే ఫస్ట్ మూవీ కూడా ఇదే అవుతుంది. ప్రస్తుతానికి అయితే అక్కినేని అభిమానులతో పాటు మూవీ లవర్స్ అందరూ చై – శోభిత ధూళిపాళ్ల పెళ్లి గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×